E-Paper
Advertisement

Anil – Venky: వెంకటేష్ కొత్త మూవీలో నేషనల్ విన్నింగ్ హీరోయిన్.. మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ?

Anil – Venky: వెంకటేష్ కొత్త మూవీలో నేషనల్ విన్నింగ్ హీరోయిన్.. మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ?
Advertisement

Anil – Venky: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిట్ మిషన్ గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) మరొకవైపు ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న వెంకటేష్ (Venkatesh ) ఏకంగా ఐదవ సారి సినిమా చేయడానికి సిద్ధం అయిపోయారు. విషయంలోకి వెళ్తే.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2 సినిమా తొలిసారి వచ్చి మంచి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ పేరిట ఊహించని విజయాన్ని సొంతం చేసుకుని.. అభిమానులకు కావలసిన స్టాండర్డ్ వినోదాన్ని అందించింది. ఆ తర్వాత ఎఫ్ 3 సినిమా వచ్చింది .కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను బ్లాక్ బస్టర్ రేంజ్ లో మెప్పించలేదు. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్టును సొంతం చేసుకుంది.

మల్టీ స్టారర్ మూవీకి సర్వం సిద్ధం..

ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కీలక పాత్ర పోషించి, మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. అలా నాలుగు సార్లు వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రాగా అన్నీ కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఏకంగా ఐదవ సినిమాకు సిద్ధం అయిపోయారు. మళ్ళీ 2027 సంక్రాంతి టార్గెట్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) మరో హీరోగా ఎంపికయ్యారు. పైగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనడంతో అప్పుడే అంచనాలు కూడా పీక్స్ కి చేరిపోయాయి. ఎందుకంటే అటు కళ్యాణ్ రామ్ కూడా మాస్ యాక్షన్ చిత్రాలే కాకుండా కామెడీ చిత్రాలతో కూడా ఆకట్టుకున్నారు. ఇక కామెడీ ప్రధానంగా ఈ సినిమా రాబోతోందని సమాచారం.

అనిల్ – వెంకటేష్ సినిమాలో మహానటి..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే కామెంట్లు గత కొద్ది రోజులుగా వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ మహానటి అలియాస్ కీర్తి సురేష్ ని హీరోయిన్గా తీసుకోబోతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇక భారీ అంచనాల మధ్య మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ను ఎంపిక చేయడంతో అనిల్ మాస్టర్ ప్లాన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

వెంకటేష్ తదుపరి చిత్రాలు..

మరొకవైపు వెంకటేష్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు . ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆయన అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా వరుస చిత్రాలతో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇటు కామెడీ మెచ్చే అభిమానులను ప్రధానంగా చేసుకొని.. ప్రేక్షకులను అలరించడానికి వెంకటేష్ సిద్ధం అయిపోయారు. ఇకపోతే గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు స్క్రిప్ట్ అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు దర్శకుడిగా వెంకటేష్ తో మొదటిసారి సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇందులో వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది.

Advertisement

also read: UBS Pawan Kalyan: డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. 20 నిమిషాల్లోనే ఓటీటీ డీల్!

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×