E-Paper
Advertisement

Keerthy Suresh: 10 దోసెలు, ఇడ్లీలు తింటా..కీర్తి సురేష్ ఫిట్నెస్ సీక్రెస్ ఇదేనా?

Keerthy Suresh: 10 దోసెలు, ఇడ్లీలు తింటా..కీర్తి సురేష్ ఫిట్నెస్ సీక్రెస్ ఇదేనా?
Advertisement

Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ (Keerthy Suresh)అనంతరం నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతో తన నటనతో ఆకట్టుకున్న ఈమె అనంతరం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే కీర్తి సురేష్ రివాల్వర్ రీటా(Revolver Rita) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రివాల్వర్ రీటాగా కీర్తి సురేష్..

ఈ సినిమా నవంబర్ 28వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కీర్తి సురేష్ తన ఫిట్నెస్ గురించి తెలియజేశారు. తాను ఫిట్నెస్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోనని తెలిపారు. చాలామంది ఫిట్నెస్(Fitness) కోసం పెద్ద ఎత్తున ఫుడ్ డైట్ ఫాలో అవుతుంటారు తాను అలాంటి పనులు చేయనని తెలిపారు. ఇప్పటికీ కూడా ఫుడ్ విషయంలో నాకంటూ కంట్రోల్ ఉండదని, మనస్ఫూర్తిగా తనకు నచ్చింది తింటానని తెలిపారు. నేను రోజుకు 10 ఇడ్లీలు లేదా 10 దోసెలు తింటానని ఈమె షాకింగ్ విషయాలను బయటపెట్టారు.

మహానటి సినిమా తరువాతనే..

Advertisement

ఇలా ఫుడ్ కంట్రోల్ లేకుండా తిన్నప్పటికీ తాను మాత్రం వర్కౌట్స్ ఒక్కటే చేస్తానని ఇలా వర్కౌట్స్ ద్వారా బరువు తగ్గుతానని తెలిపారు. తాను ఒకే ఏడాదిలో ఏకంగా 10 కిలోల బరువు తగ్గానని కీర్తి సురేష్ తెలిపారు. ఇక స్కిన్ కేర్ విషయంలో కూడా తాను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించనని మహానటి సినిమా తరువాతనే స్కిన్ కేర్ పై కూడా కాస్త శ్రద్ధ పెడుతున్నానని ఈమె తెలియజేశారు. ఇలా కీర్తి సురేష్ ఏకంగా 10 దోసెలు 10 ఇడ్లీలు తింటానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా హీరోయిన్స్ స్లిమ్ గా ఉండడం కోసం దాదాపు వారికి నచ్చిన ఫుడ్ మొత్తం దూరం పెట్టేస్తూ ఉంటారు . కానీ కీర్తి సురేష్ మాత్రం ఫుడ్ విషయంలో కంట్రోల్ ఉండదని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు..

Advertisement

ఇక కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా కీర్తి సురేష్ ఆంటోనీ తట్టిల్(Antony Thattil) అనే వ్యక్తితో ప్రేమలో ఉంటూ గత ఏడాది ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. ఇలా వృత్తి పరమైన జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోను ఈమె ఎంతో సంతోషంగా బిజీగా ఉన్నారు. ఇక కీర్తి సురేష్ భర్త ఆంటోని వ్యాపారవేత్త అనే సంగతి తెలిసిందే. ఈయన సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు.

Also Read: Actress Imanvi: ఫౌజీ రిలీజ్ .. వాటికి దూరంగా ఉంటున్న ఇమాన్వి..గ్రేట్ అంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×