Tollywood:సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య హీరోయిన్లు కొంతమంది కెరియర్ కే ప్రాధాన్యతనిస్తుంటే.. మరి కొంతమంది ఒకవైపు కెరియర్ చూసుకుంటూనే.. మరొకవైపు వ్యక్తిగత జీవితానికి ప్రయారిటీ కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులోనే తీరిపోవాలి అనే రేంజ్ లో హీరోయిన్స్ కూడా ఆలోచిస్తున్నారని చెప్పాలి. కానీ మరి కొంతమంది సమయం సందర్భం వచ్చిన తర్వాతే అన్నీ అభిమానులతో పంచుకుంటాం అంటూ.. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ఆనందపు క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు కొంతమంది ఒకటి రెండు సినిమాలు చేసినా ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో కేరింత బ్యూటీ భావన కూడా ఒకరు. ఈ సినిమాలో క్యూట్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ హృదయాలను బాగా దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఈమెకు కూడా మంచి పేరు లభించింది. ముఖ్యంగా ఈమె ఎక్కడ కనిపించినా సరే కేరింత భావన అని పిలుస్తారే తప్ప ఈమె అసలు పేరు సుకృతి అని గుర్తుపెట్టుకున్న రోజులు దాదాపు లేవనే చెప్పాలి. అలా తన పాత్రతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది సుకృతి.
ఇకపోతే ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు ఈ ముద్దుగుమ్మ . పూర్తిగా నటన కెరియర్ ను పక్కన పెట్టేసి 2022 డిసెంబర్లో అక్షయ్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లయిన తర్వాత మళ్లీ దర్శనం ఇవ్వలేదు. దీంతో సుకృతి ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అని అభిమానులు ఆరా తీయగా.. సడన్గా బేబీ బంప్ తో కనిపించి సర్ప్రైజ్ చేసింది. నాలుగేళ్ల తర్వాత తల్లి కాబోతున్నాను అంటూ ఆ ఆనందపు క్షణాలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తన భర్తతో కలసి బీచ్ ఒడ్డున బేబీ బంప్ తో దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.. ఇక వీటిని చూసిన అభిమానులు, నెటిజన్స్, ప్రముఖులు సుక్రుతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ALSO READ:HBD Boyapati: మాస్ కి కేరాఫ్ అడ్రస్.. హీరోల పాలిట లక్కీ డైరెక్టర్!
సుకృతి విషయానికి వస్తే.. ఈమె ఢిల్లీకి చెందిన అమ్మాయి. అసలు పేరు సుకృతి అంబటి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో తండ్రి పెంపకంలోనే పెరిగింది. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసి.. రాజస్థాన్లోని బనస్థలి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసింది. చదువుతున్న సమయంలోనే డాన్స్, నటనపై మక్కువ పెంచుకొని స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేది. అలా దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో ఒక హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. అయితే ఒక్క సినిమాకే పరిమితం అయింది. మరో సినిమాలో నటించలేదు. ఇక తర్వాత పెళ్లి చేసుకొని సెటిలైపోయిన ఈమె.. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక్క సినిమాలో నటించినా తన పాత్రతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న సుకృతి.. నేడు తల్లి కాబోతోందని అభిమానులతో పంచుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
https://www.instagram.com/itsmesukrithi/p/DXdcW4sFB7F/