E-Paper
Advertisement

Varanasi film: వారణాసి సినిమాలో కన్నడ స్టార్ హీరో..పక్కాగా ప్లాన్ చేసిన రాజమౌళి!

Varanasi film: వారణాసి సినిమాలో కన్నడ స్టార్ హీరో..పక్కాగా ప్లాన్ చేసిన రాజమౌళి!
Advertisement

Varanasi film: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి(Varanasi) సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో హీరోయిన్గా నటిస్తున్నారు. అదేవిధంగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం కుంభ అనే విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్..

ఇప్పటికే వీరిద్దరి పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈయన మహేష్ బాబుకి తండ్రి పాత్రలో అలాగే మహా శివ భక్తుడిగా కూడా కనిపించబోతున్నట్లు స్వయంగా తన పాత్ర గురించి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో మరొక కోలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు బయటకు వచ్చాయి .ఈ పాత్రలో మాధవన్ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించలేదు.

వారణాసి సినిమాలో సుదీప్ కిచ్చా?

Advertisement

తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ అవుతుంది. ఈసారి జక్కన్న కన్నడ ఇండస్ట్రీ నుంచి మరొక స్టార్ హీరోని కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నారని తెలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు కిచ్చా సుదీప్ ఒకరు. ఈయన ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని, ఇప్పటికే సుదీప్ ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సుదీప్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

2027 ఏప్రిల్ 7 న విడుదల…

Advertisement

ఇకపోతే ఇదివరకే సుదీప్ రాజమౌళి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈగ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రలో సుదీప్ నటించారు. ఇప్పుడు మరోసారి ఈయన ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమా 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాని 2027 ఏప్రిల్ ఏడవ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం విడుదల తేదీని అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read; Nagachaitanya: అక్కినేని లెగసీపై నాగచైతన్య కామెంట్స్.. అస్సలు పోల్చుకోలేనంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×