E-Paper
Advertisement

Ramzan 2026: ప్రభుత్వం కీలక ఆదేశం.. తెల్లవారుజామున 5 గంటల వరకూ షాపులు ఓపెన్.. ఎందుకంటే?

Ramzan 2026: ప్రభుత్వం కీలక ఆదేశం.. తెల్లవారుజామున 5 గంటల వరకూ షాపులు ఓపెన్.. ఎందుకంటే?
Advertisement

Ramzan 2026: రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లకు ప్రత్యేక మినహాయింపులు ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు ఈ మినహాయింపులు అమల్లో ఉండనున్నాయి. దీని ప్రకారం ఆయా రోజుల్లో తెల్లవారుజామున 5 గంటల వరకు షాపులు తెరిచి ఉంచుకోవచ్చు. రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని లేబర్ కమిషనర్ దాన కిషోర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

రంజాన్ వేళ పనిగంటలను పొడిగించిన నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరికొన్ని నిబంధనలు జారీ చేసింది. అదనపు పని చేసిన ఉద్యోగులకు డబుల్ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. సెలవు రోజుల్లో పని చేస్తే ప్రత్యామ్నాయ సెలవు తప్పనిసరి అని పేర్కొంది. ఏ రోజు అయినా పని సమయం 13 గంటలు మించకూడదని షరతు విధించింది. అదే సమయంలో మహిళా ఉద్యోగులకు అదనపు పని నుంచి మినహాయింపు ఇచ్చింది. రాత్రి 8:30 తర్వాత మహిళా ఉద్యోగులను పనిచేయించరాదని ఆదేశించింది.

Advertisement

దుకాణాల సమయాన్ని పొడిగించిన నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో రంజాన్ శోభ సంతరించుకోనుంది. పాతబస్తి, చార్మినార్, లాడ్ బజార్ వంటి ముస్లిం పాపులారిటీ అధికంగా ఉండే ఏరియాల్లో తెల్లవారుజాము వరకూ షాపులు తెరుచుకోనున్నాయి. దీని ద్వారా పసందైన వంటకాలు అటు ముస్లింలతో పాటు నగరవాసులకు సైతం అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా హలీమ్, బిర్యానీ, ఇరానీ చాయ్ వంటివి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫుడ్ లవర్స్ కు లభించనున్నాయి.

Also Read: Rahul Gandhi: చైనా రోబోలు పట్టుకొచ్చి.. మనవని చెప్తారా? కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

Advertisement

రాబోయే రంజాన్ పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ శాఖ కూడా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఉర్దూ స్కూళ్లతో పాటు పాటు డైట్ (DIET) కళాశాలలకు ప్రత్యేక పని వేళలను కల్పించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకూ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మిస్ అయిన సిలబస్ ను కవర్ చేసేందుకు మార్చి 20 నుంచి అదనపు తరగతులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read: Fridges Under Rs 30,000: తక్కువ బడ్జెట్‌లో.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే.. మెరుగైన కూలింగ్, అత్యాధునిక ఫీచర్లు!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×