Timmaraju Palli Tv Trailer: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇలా హీరోగా వరుస సక్సెస్ సినిమాలను సొంతం చేసుకున్న ఈయన నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. ఇక కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం తిమ్మరాజు పల్లి టీవీ(Timmaraju Palli Tv). 25 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఏప్రిల్ 17వ తేదీ తిమ్మరాజు పల్లి టీవీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
తిమ్మరాజు పల్లి టీవీ ట్రైలర్ 2:16 సెకండ్ల నిడివితో విడుదల అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒకప్పుడు పల్లెల్లోని జ్ఞాపకాలన్నీ గుర్తు చేసేలా ఉందని చెప్పాలి. ఒకానొక సమయంలో గ్రామాలలో పెద్దగా టీవీలు ఉండేవి కావు ఎవరింట్లో అయితే టీవీ ఉందో అక్కడికి వెళ్లి గ్రామస్తులు అంత టీవీ చూస్తూ ఎంజాయ్ చేసేవారు. అలా ఈ ట్రైలర్ మొత్తం గత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఎంతో సరదాగా సాగిపోతుంది. ఇలా సరదాగా మొదలైన ఈ ట్రైలర్ గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఏర్పడిన గొడవలు నేపథ్యంలో కొనసాగుతోంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే టీవీ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరించగా సాయి తేజ్ (Sai Tej ), వేదశ్రీ (Vedha) హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఈ సినిమా ద్వారా మునిరాజు ( Muniraju) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఇలా సుమారు 25 మంది కొత్త వాళ్ళతో తక్కువ బడ్జెట్ తో ఒక అద్భుతమైన విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం ప్రేక్షకులం ముందుకు రాబోతున్నారు.
ఏప్రిల్ 17వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ ను అందుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడంతో తనలాగే సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చే వారికోసం ఈయన నిర్మాతగా మారి తనవంతుగా కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ఈయన నిర్మాణంలో రాబోతున్న తిమ్మరాజు పల్లి టీవీ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇప్పటివరకు హీరోగా మంచి సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరంకు నిర్మాతగా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో వేచి చూడాలి.
Also Read: పీరియడ్స్ లో ఉండగానే ఆ పనులు చేశా..సాకులు మాత్రం చెప్పలేదు: శ్రీలీల