E-Paper
Advertisement

కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!

కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!
Advertisement

Adinarayana Reddy: జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.. రాష్ట రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ .. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ఆ మాజీ మంత్రి ఏది మాట్లాడినా సంచలనమే.. ఆవేశమొస్తే తనమన అని తేడా లేకుండా మాట్లాడే ఆయన తాజాగా కూటమి ప్రభుత్వంపైనే మాటల తూటాలు పేల్చారు. బీజేపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారని, వారి కోసం అవసరమైతే రాజీనామా కైనా సిద్దమే అంటున్నారు. అసలు ఆయన టార్గెట్ చేసింది ఎవర్ని? జమ్మలమడుగు వేదికగా పేలిన తూటా ఫైర్ అవుతుందా?.. మిస్ ఫైర్ అవుతుందా?

మంత్రి పదివి కొట్టేసి లక్కీ లీడర్..

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆధినారాయణ రెడ్డి కడప జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న సీనియర్ పొలిటీషియన్. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి అండతో కాంగ్రెస్ పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రెండు సార్లు జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచారు. తర్వాత జగన్ వెంట వైసీపీ గూటికి చేరి ఫ్యాన్ గుర్తుతో మూడో సారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే గెలిచిన ఆరు నెలలకే సైకిల్ ఎక్కి ఏకంగా మంత్రి పదివి కొట్టేసి లక్కీ లీడర్ అనిపించుకున్నారు. పార్టీ మారిన దగ్గర నుంచి జగన్ పై ఒంటి కాలిపై లెగుస్తూ, నిత్యం ఆరోపణలు చేసే నేతల్లో ఆదినారాయణ రెడ్డి ముందు వరసలో ఉంటూ వస్తున్నారు.

సీన్ రివర్స్..

Advertisement

2019లో ఓటమి తర్వాత బీజేపి గూటికి చేరి, వైసీపీ ప్రభుత్వ వేధింపులకు గురికాకుండా సేఫ్ సైడ్‌లో గడిపారు. 2024 లో మొదటి సారి కమలం గుర్తుపై భారీ మెజారిటితో గెలిచి సీమలో కమలం పార్టీకి ఊపిరి పోశారు. ఇక కూటమిలో ఎమ్మెల్యే ఆదికి తిరుగులేదు అని అందరు భావించినా సీన్ రివర్స్ అయిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ సాగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రోజు నుంచి వరుస వివాదాలు ఆదిని చుట్టుముడుతున్నాయి. సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో సొలార్ విండ్ పవర్ ప్రాజెక్ట్ పనుల్లో, సబ్ కాంట్రాక్ట్ తన అనుచరులచే ఇవ్వాలని హడావిడి చేసి, ఎంపీ సీఎం రమేష్ నాయుడితో కయ్యానికి కాలు దవ్వారు.

Also Read: తెలంగాణ టీమ్‌కు దేశ బాధ్యతలు.. ఏఐసీసీ సంచలన నిర్ణయం..?

కార్యకర్తల కోసం రాజీనామా..

Advertisement

ఆ వివాదం మూగియక ముందే ధర్మల్ పవర్ ప్లాంట్ ప్లైయాష్ విషయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డితో మొదలైన విభేదాలు తీవ్ర ఉద్రక్తతకు దారి తీశాయి. చివరికి సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నా వివాదం పరిష్కారం కాలేదు. ఇటీవల గండికోట అభివృద్ధి పనులు తమ కార్యకర్తలకే దక్కాలంటూ.. అక్కడి పనులను అడ్డుకొని మరో వివాదంలో కూరుకుపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా ఆదినారాయణ కార్యకర్తల కోసం రాజీనామా చేయడానికి సిద్దమని వ్యాఖ్యానించడం కూటమిలో తీవ్ర కలకలం రేపుతున్నాయట.. అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే ఆదిని ఇబ్బందికి గురి చేస్తున్న నేతలెవరు?.. తన మాటల తూటాలతో ఎదుటి వారిని డిఫెన్స్ లో పడేసే ఎమ్మెల్యే ఆది ఎందుకు డిఫెన్సె లో పడిపోయారు? రాజీనామా వ్యాఖ్యల వెనుక రాజకీయ హ్యూహం ఏంటని? ప్రతిపక్ష పార్టీతో పాటు కూటమిలో కూడా జోరుగా చర్చ మొదలైందట..

బీజేపిలో వర్గ పోరు..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపి కోటాలో ఆదినారాయణరెడ్డికి మంత్రి పక్కా అనుకున్నా మొదటి విడతలో ఆయన్ని అదృష్టం వరించలేదు.. ఇక మంత్రివర్గ విస్తరణలో అయినా మంత్రి పదవి దక్కించుకోవడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపి కి మెజారిటీ స్థానాలను ఇవ్వాలని ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. అసలే మంత్రిపదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న ఆదికి బీజేపిలో వర్గ పోరు మరింత తనొప్పిగా మారిందంట. కడప జిల్లాకు చెందిన బీజేపి నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఢిల్లీ పెద్దల దగ్గర వద్ద చక్రం తిప్పుతూ ఆదికి చెక్ పెట్టాలని చూస్తున్నారంట. అందుకే ఆయన సడన్‌గా రాజీనామా అస్త్రాన్ని సంధించారంటున్నారు.. మరి ఆది వ్యాఖ్యలు కూటమిలో ఎలాంటి కుంపట్లు రాజేస్తాయో? చూడాలి.

Storey By: Appa Rao Big Tv

Also Read: మణిపూర్‌లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి

Related News

కమ్మని కబుర్లు వెనుక కన్నింగ్ ప్లాన్.. వీల్లని నమ్మితే మీ పని అయిపోయినట్టే?

ఒకే దెబ్బకు రెండు నిర్ణయాలు.. సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ మార్పులపై రచ్చ!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్‌మెంట్లు!

Big Stories

Advertisement
×