Kiran Abbavaram:కిరణ్ అబ్బవరం..రాజావారు..రాణి వారు అంటూ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే మాత్రం ఎవరికీ అర్థం కాని ఒక ‘మిస్టరీ’లా కనిపిస్తుంది.అవును..’SR కళ్యాణమండపం’తో కొంచెం క్రేజ్ ఇలా వచ్చిందో లేదో వరుసగా అరడజను ఫ్లాపులు అలా వచ్చిపడ్డాయ్.దీంతో ‘ఇక ఈ అబ్బాయి పని అయిపోయింది’ అని అందరూ ఫిక్స్ అయిపోయిన టైంలో సరిగ్గా ‘క’ అంటూ వచ్చి పెద్ద సర్ ప్రైజే ఇచ్చాడు. అయితే ఆ సక్సెస్ కిరణ్ టాలెంట్ వల్ల వచ్చిందా లేక ఆడియన్స్‌కు వేరే ఆప్షన్ లేక చూశారా? అన్నది కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు తన లైనప్‌తో టాలీవుడ్ టాప్ హీరోలకు కూడా షాక్ ఇస్తున్నాడు.
తమిళ క్రేజ్‌ను వాడుకుని ఏదోలా గట్టెక్కాలని చూస్తున్నారా
ఇక ప్రస్తుతం కిరణ్ చేతిలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘బేబీ’తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిన సాయి రాజేష్ కాంపౌండ్ నుండి వస్తుంది అంటే హైప్ స్కైలో ఉంటుంది.కానీ ఇక్కడే ఒక ‘నెగెటివ్’ టాక్ వినిపిస్తుంది.సాయి రాజేష్ మార్కు పెయిన్ ఫుల్ ఎమోషన్స్‌ను పండించే సీన్ అబ్బవరం ఫేస్‌లో ఉందా? లేక శ్రీ గౌరీ ప్రియ తమిళ క్రేజ్‌ను వాడుకుని ఏదోలా గట్టెక్కాలని చూస్తున్నారా అని. బాగుంటే ఓకే కాని కథలో దమ్ము లేకపోతే మాత్రం ఈ సినిమా చెన్నైలో కూడా ‘బోల్తా’ కొట్టడం ఖాయం.
అబ్బవరం మార్కు యాక్టింగ్‌ను యాక్సెప్ట్ చేస్తారా?
ఇక ఇపుడు చేస్తున్న సినిమాలు చాలవన్నట్టు అమెజాన్ ప్రైమ్ లాంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో ‘గువ్వలచెరువు ఘాట్’ అంటూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు.ఈ సిరీస్ కి ‘డియర్ కామ్రేడ్’ లాంటి క్లాసిక్ తీసిన భరత్ కమ్మ డైరెక్టర్ కావడం కాస్త క్యూరియాసిటీ పెంచేదే.ఇక గ్లింప్స్ చూస్తుంటే చాలా ‘రా’ అండ్ ‘రస్టిక్’గా ఉంది. మరి పాన్ ఇండియా ఆడియన్స్ కిరణ్ అబ్బవరం మార్కు యాక్టింగ్‌ను యాక్సెప్ట్ చేస్తారా? లేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ట్రోలర్లకు ఫుల్ మీల్స్ దొరుకుతుందా? అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్.
also read:Pradeep Ranganathan: ఏలేటితో రిస్క్ చేస్తున్న ప్రదీప్ రంగనాథ్?
సుకుమార్ అసిస్టెంట్ వీర కోగటం డైరెక్షన్‌లో
మరో వైపు సుకుమార్ అసిస్టెంట్ వీర కోగటం డైరెక్షన్‌లో ఒక యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశాడట కిరణ్. ఇది స్వయంగా సుకుమార్ ఓకే చేసిన స్క్రిప్ట్ అని ఇన్ సైడ్ టాక్. వినడానికి బానే ఉంది కానీ, సుకుమార్ అసిస్టెంట్లు అందరూ సుకుమార్ అవ్వలేరు కదా.ఇక రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో మళ్ళీ అదే పాత ఫ్యాక్షన్, కత్తులు, బాంబులు అంటే ఆడియన్స్ థియేటర్ వైపు కూడా చూడరు.మరి కిరణ్ నమ్ముతున్న ఈ ‘సెకండ్ హాఫ్’ అదృష్టం వర్కవుట్ అవుతుందా చూడాలి
ఇప్పుడు డైరెక్షన్ అవసరమా
ఇక వీటన్నింటికీ మించిన మరో క్రేజీ న్యూస్ ఏంటో తెలుసా ..అదే .. కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘డైరెక్టర్’ అవతారం ఎత్తడం.అయితే ఒక పక్క హీరోగా నిలదొక్కుకోవడానికే కిందా మీదా పడుతుంటే, ఇప్పుడు డైరెక్షన్ అవసరమా అన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయ్.మరి అది తన మీద తనకు కాన్ఫిడెన్సా ..లేక ఇక ఏదైనా చేయగలనన్న ఓవర్ కాన్ఫిడెన్సా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.చూడాలి మరి కిరణ్ లైనప్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లెవల్ ప్లానా లేక కెరీర్ క్లోజ్ చేసే సీనా అన్నది కాలమే డిసైడ్ చేయాలి !
also read:Dhurandhar 2 box office: దురంధర్2 ధాటికి రికార్డులన్నీ గాలిలో కలవాల్సిందేనా?