E-Paper
Advertisement

Dhurandhar 2 box office: దురంధర్2 ధాటికి రికార్డులన్నీ గాలిలో కలవాల్సిందేనా?

Dhurandhar 2 box office: దురంధర్2 ధాటికి రికార్డులన్నీ గాలిలో కలవాల్సిందేనా?

Dhurandhar 2 box office: ”తెలుగు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని ఏలేస్తుంటే బాలీవుడ్ సినిమాలు బొక్కబోర్లా పడుతున్నాయ్”ఇదీ కొంత కాలం క్రితం ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపించిన మాట.కానీ ఏ ముహూర్తాన దురంధర్ అంటూ ఆదిత్యధర్ ఎంట్రీ ఇచ్చాడో గానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఇక లేటెస్ట్ గా పార్ట్ 2 అంటూ వచ్చిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ విధ్వంసం ఏ రేంజ్ లో అంటే ఏకంగా ఉందంటే పది రోజుల్లోనే అన్ని పాత రికారులన్నింటిని మడతపెట్టేంతగా.

11 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా 1352 కోట్ల గ్రాస్

యస్…రణ్‌వీర్ హీరోగా వచ్చిన ఈ లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఒక డైనోసార్ లా మారిపోయింది. రిలీజ్ అయిన 11 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా 1352 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులని లిఖించేస్తుంది.పోయినేడు వచ్చిన ఫస్ట్ పార్ట్ సెట్ చేసిన రూ 1307 కోట్ల లైఫ్ టైమ్ రికార్డును ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే బద్దలు కొట్టిందంటే.. రణ్‌వీర్ సింగ్ సృష్టిస్తున్న ఈ ప్రభంజనం ఏ రేంజ్‌లో ఉందో అర్థం అయిపోతుంది.

‘ధురంధర్ 2’తో బాక్సాఫీస్ దగ్గర సునామీ

ఇక ఈ సినిమా పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందిస్తూ.. “ఆదిత్య ధర్ అనే డైనోసార్‌ని చూసి బాలీవుడ్ మేకర్స్ అందరూ భయంతో సైలెంట్ అయిపోయారు” అని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయ్. తొలి ‘ఉరి’ సినిమాతోనే తన మేకింగ్ పవర్ ఏంటో చూపెట్టిన ఆదిత్యధర్ , ఇప్పుడు ‘ధురంధర్ 2’తో బాక్సాఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తున్నాడన్న మాట.

ఆల్ టైమ్ టాప్ హిందీ డబ్బింగ్ సినిమా

ఇక హిందీ సినిమాలంటే బాంబే కే పరిమితం అనే అంచనాలని పటాపంచలు చేస్తూ ‘ధురంధర్ 2’ తెలుగునాట ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం గమనార్హం.ఇక ఇది త్వరలో 100 కోట్లు క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు.ఇకపోతే షారుఖ్ ఖాన్ ‘జవాన్’ (రూ.28 కోట్లు), రణ్‌బీర్ ‘బ్రహ్మాస్త్ర’ (రూ.15.27 కోట్లు) సెట్ చేసిన రికార్డులను ఇప్పటికే మడతెట్టేయ్యగా ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ (రూ.46 కోట్లు) రికార్డును కూడా క్రాస్ చేసి తెలుగులో ఆల్ టైమ్ టాప్ హిందీ డబ్బింగ్ సినిమాగా రికార్డ్ ని రీ రైట్ చేసేందుకు రెడీ అయిపొయింది.కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఇండియా వైడ్‌గా రూ.33.7 కోట్ల గ్రాస్ రాబట్టడం ఇక్కడ విశేషం.

also read:Varun Tej Bari movie: వరుణ్ తేజ్ ‘బరి’లోకి దిగుతున్నాడా? లేక బలి అవుతున్నాడా?

కేజీఎఫ్, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డులన్ని ఖతం 

ఇక కేవలం ఇండియాలోనే కాదండోయ్ .. ఓవర్సీస్ మార్కెట్‌లో రణ్ వీర్ రికార్డుల భరతం పట్టేస్తున్నాడు.అవును ఈ సినిమా రిలీజ్ అయిన 9 రోజుల్లోనే $22.1 మిలియన్లను రాబట్టి ‘బాహుబలి 2’ వంటి భారీ చిత్రాల రికార్డులకే ఎసరు పెట్టేశాడు.ఇక సౌత్ బ్లాక్ బస్టర్లైన కేజీఎఫ్, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డులన్నింటినీ ఒక్కొక్కటిని దాటుకుంటూ ‘ధురంధర్ 2’ తన దండయాత్రని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది.

ఈజీగా రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం

ఇక ఇపుడు బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఊపు చూస్తుంటే,త్వరలోనే ఈ సినిమా ఈజీగా రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ పండిట్స్ అంచనా.ఒక వేళ గనుక అదే జరిగితే మాత్రం అమీర్ ఖాన్ ‘దంగల్’ తర్వాత ఆస్థాయి మెయిల్ స్టోన్ ని అందుకున్న రెండో భారతీయ సినిమాగా ‘ధురంధర్ 2’ హిస్టరీలో నిలవడం పక్కా. చూడాలి మరి ఆదిత్య ధర్ అద్భుతమైన విజువల్స్, రణ్‌వీర్ సింగ్ కెరీర్ బెస్ట్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో ఈ డైనోసార్ ప్రస్థానం ఇంకెన్ని వేల కోట్లు కొల్లగొడతాడో !

also read:అఖండ 2 దెబ్బకి రూటు మార్చిన బాలయ్య ..!

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×