Raviteja -Kona Venkat: ప్రముఖ సినీ కథా రచయిత, నిర్మాత అయిన కోన వెంకట్ ప్రస్తుతం బ్యాండ్ మేళం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. హర్ష రోషన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే కోన వెంకట్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సినిమా షూటింగ్ లొకేషన్ లో రవితేజకు జరిగిన అవమానం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
రవితేజ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కెరియర్ మొదట్లో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ఈయన ప్రయాణం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదగారనే చెప్పాలి. అయితే రవితేజ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అవమానాలు పడ్డారు అంటూ కోన వెంకట్(Kona Venkat) ఈ సందర్భంగా తెలియజేశారు. రవితేజ (Raviteja)అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న సమయంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో భోజనం చేసే దగ్గర ఆయనని అవమానించారని తెలిపారు.
రవితేజ భోజనం చేస్తున్న సమయంలో నిర్మాత అక్కడికి రావడం రవితేజ భోజనం చేయడం చూశారు. ఇలా రవితేజ భోజనం చేస్తుంటే అడ్డమైన వాళ్ళందరూ వచ్చి భోజనం చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భోజనం వడ్డించే అతని దగ్గరకు వెళ్లి వచ్చిన వారందరికీ పెట్టడానికి ఇదేమైనా నీ సొమ్మ అంటూ కూడా అవమానించారని కోన వెంకట్ తెలిపారు. అలా ఆరోజు అవమానించిన ఆ నిర్మాత తిరిగి రవితేజ డేట్స్ కోసం ఆయన వెంట పడ్డారు. ఆ క్షణం తనతో సినిమా చేయొద్దని రవితేజకు నేను చెప్పాను కానీ రవితేజ మాత్రం వినలేదు.
నిర్మాతకు రవితేజ గుణపాఠం..
నిన్ను అవమానించిన ఆ వ్యక్తికి డేట్స్ ఇవ్వకుండా నీ లెవెల్ ఏంటో చూపించు అని నేను రవితేజకు సలహా ఇవ్వడంతో రవితేజ మాత్రం అతని బ్యానర్ లో సినిమా చేసి సక్సెస్ కొట్టినప్పుడే నేను విజయం సాధించినట్టు అంటూ ఆయనతో సినిమా చేసి సూపర్ సక్సెస్ అందుకొని తనకు సరైన గుణపాఠం చెప్పారని కోన వెంకట్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరి రవితేజను అవమానించిన ఆ నిర్మాత ఎవరు? ఆ నిర్మాతతో రవితేజ చేసిన ఆ సినిమా ఏంటి? అనే విషయాలను మాత్రం కోన వెంకట్ వెల్లడించలేదు. ఇలా రవితేజ ఈ స్థాయిలో సక్సెస్ అందుకున్నారు అంటే ఆ సక్సెస్ వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయనే చెప్పాలి. సినిమాలపై ఆసక్తితో అవకాశాల కోసం స్టూడియోల వెంట తిరిగిన రవితేజ నేడు తన పేరుతో మల్టీప్లెక్స్ లను నిర్మించే స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
Also Read: Band Melam Film: శ్రీరామనవమికి వస్తున్న ‘బ్యాండ్ మేళం’.. ఈ సారైనా పక్కాగా వస్తారా?