Krishnambhaje Movie:నేడు కృష్ణాష్టమి సందర్భంగా పలు చిత్రాల నుండి కొన్ని పోస్టులు, పోస్టర్లు సోషల్ మీడియాలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తిరస చిత్ర కావ్యం ‘కృష్ణం భజే’ మూవీ నుండి కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. అందులో బ్రహ్మాజీ సాధువు పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే.. జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస కావ్యం కృష్ణం భజే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజు కొట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji ) మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా బ్రహ్మాజీ కృష్ణం భజే ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని , అంచనాలను పెంచేసింది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్ లో సాంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూది, చేతిలో కమండలంతో ఆయన లుక్ ప్రత్యేకంగా నిలుస్తోంది . భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతిబింబంగా కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ సినిమా పై ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రంలో మురళీ గౌడ్, రచ్చ రవి , గౌతమ్ రాజు, దయానంద రెడ్డి, యాదమ్మ రాజు, అభయ్ బెతిగంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హీరోగా ప్రదీష్, హీరోయిన్ గా వంగమయి పటేల్ నటిస్తున్నారు. పైగా ఈ చిత్రానికి సంభాషణలను రచ్చ రవి అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణం భజే మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలను త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తోంది.
ALSO READ:సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?
ఈ చిత్రానికి కలాల్ శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీరామ్ గుప్తా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగరాజు కొట్టే దర్శకత్వం వహిస్తుండగా.. రాము సీఎం , సూర్య మీసాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మంతెన త్రినాథ్, సత్య సోమేశ్ సంగీతం అందిస్తుండగా.. జి రాకేష్ గౌడ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఫైట్స్ రవితేజ, కొరియోగ్రఫీ ఏ ఆర్ బాబు, బాలకృష్ణ , పబ్లిసిటీ డిజైనర్ వివారెడ్డి , పి ఆర్ ఓ గా అశోక్ దయ్యాల పనిచేస్తున్నారు.