E-Paper
Advertisement

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?
Advertisement

Chiranjeevi Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈయన.. గతంలో తనకు ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ బాబి కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో కాకా(Kaaka ) అనే క్రేజీ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని 2027 జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ముందుగానే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా రెండు సంక్రాంతులతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి.. ఈ సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేస్తే హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని ఊహాగానాలు కూడా వ్యక్తం చేశారు.

కాకా సంక్రాంతి నుండి తప్పుకోబోతోందా?

అయితే ఇలాంటి సమయంలో సంక్రాంతి రేస్ నుండి ఈ సినిమా తప్పుకోబోతోంది అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం ఇప్పటికే 2027 సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండడం, థియేటర్ల సర్దుబాటుతో పాటు ఓటీటీ తీవ్రత ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతి నుంచి తప్పించబోతున్నారనే కామెంట్లు ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

అసలు నిజం ఎంత?

Advertisement

ఇదే సమయంలో.. సమ్మర్ లో ఈ సినిమాను స్పెషల్గా రిలీజ్ చేసి కలెక్షన్లు వసూలు చేసుకోవాలనే విధంగా 2027 సమ్మర్ సీజన్ కు ఈ సినిమాను వాయిదా వేసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అసలు నిజం తెలియాలి అంటే.. డైరెక్టర్ బాబీ లేదా, చిత్ర నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప అసలు విషయం తెలియదు. కానీ ఈ వార్త మాత్రం అటు సినీ వర్గాలలో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే మేకర్స్ 2027 జనవరి 13వ తేదీన ఈ చిత్రాన్ని అధికారికంగా రిలీజ్ చేయాలనే దిశగా పనిచేస్తున్నారు. మరి ఈ సినిమా చెప్పినట్టుగా అదే తేదీకి వస్తుందా? లేక వాయిదా వేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

ALSO READ:రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

సంక్రాంతి రేసులో పోటీ పడనున్న చిత్రాలు ఇవే..

Advertisement

ఇదిలా ఉండగా 2027 సంక్రాంతిని టార్గెట్గా చేసుకొని రిలీజ్ కాబోతున్న చిత్రాల విషయానికొస్తే.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మహాకాళి 2027 జనవరి 8న విడుదల కానుండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీగా వస్తున్న జనవరి 12న విడుదల చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. అలాగే ఇదే రోజు సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ కూడా విడుదల కానుంది. జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో వస్తున్న కాకా విడుదల డేట్ ప్రకటించగా.. జనవరి 14న శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న జార్జ్ క్రిష్ మూవీ కూడా విడుదల కానుంది. మొత్తానికైతే ఇన్ని చిత్రాలు ఒకే టైంలో విడుదల కాబోతున్నాయి. మరి సంక్రాంతి విన్నర్ గా ఏ చిత్రం నిలుస్తుందో చూడాలి.

Related News

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×