E-Paper
Advertisement

Kurchi Thatha Death News :నన్ను బ్రతికి ఉండగానే చంపేశారు కదరా… కుర్చీ తాత ఫైర్

Kurchi Thatha Death News :నన్ను బ్రతికి ఉండగానే చంపేశారు కదరా… కుర్చీ తాత ఫైర్
Advertisement

Kurchi Thatha Death News : ఆ కుర్చీని మడతపెట్టి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో బిచ్చమెత్తుకుంటూ ఉండే ఓ ముసలాయన ఇంటర్వ్యూలో భాగంగా ఆ కుర్చీ మడత పెట్టి అంటూ ఒక బూతు పదం మాట్లాడారు.  ఇది భారీగా ఫేమస్ అవ్వడమే కాకుండా ఏకంగా సినిమాలో పాటను కూడా క్రియేట్ చేశారు. దీంతో కుర్చీ తాత సెలబ్రిటీ రేంజ్ లో పాపులర్ అయ్యారు. అయితే ఇటీవల ఈయన బయట పెద్దగా కనిపించని నేపథ్యంలో మరణించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.

నేను చచ్చిపోలేదు క్లారిటీ ఇచ్చిన కుర్చీ తాత..

గత కొంతకాలంగా ఈయన కనిపించని నేపథ్యంలో ఈయన చనిపోయారంటూ వార్తలు రావడంతో అందరూ అయోమయంలో పడ్డారు. కుర్చీ తాత నిజంగానే చనిపోయారా? లేక బ్రతుకున్నారా? అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.. ఇలా తన మరణం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరికి కుర్చీ తాత స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేశారు .ఇందులో భాగంగా తాను చనిపోయానంటూ వార్తలను రాసిన వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త ఎవరైతే రాశారో వాళ్ళు కనిపిస్తే కచ్చితంగా నేను చంపేస్తాను అంటూ ఫైర్ అవ్వడమే కాకుండా బ్రతికుండగానే నన్ను చంపేశారు కదరా అంటూ మండిపడ్డారు. ఇలా కుర్చీ తాత మరణ వార్త విని తన భార్య కూడా కంగారుపడి బాగా ఏడ్చిందని, ఇలాంటి తప్పుడు వార్తలను ఇంకోసారి రాయద్దు అంటూ ఈయన తెలిపారు.

గాంధీ హాస్పిటల్లో మృతదేహం..

Advertisement

ఇక కుర్చీ తాత మరణం గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భార్యతో వైజాగ్ సత్య మాట్లాడించారు. తన పేరు ఆసియా సుల్తానా అని తెలిపారు. అయితే కుర్చీ తాత మరణించలేదని గాంధీ హాస్పిటల్ లో ఆయన మృతదేహం ఉందని తెలియగానే అక్కడికి వెళ్ళామని, అది కుర్చీ తాత డెడ్ బాడీ కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వరంగల్ లో ఉన్నారని కుర్చి తాత భార్య ఆసియా ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. కుర్చీ తాత మరణం పై ఆయన భార్యతో పాటు ఆయన కూడా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది.

Advertisement

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతోమంది సెలబ్రిటీల గురించి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో అభిమానులు ఎంతో కంగారు వ్యక్తం చేస్తున్నారు. అయితే చివరికి సదరు సెలబ్రిటీలు స్పందిస్తూ మేము ఇంకా బ్రతికే ఉన్నామని చనిపోలేదు అంటూ క్లారిటీ ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎంతోమంది సెలబ్రిటీలను బ్రతికుండగానే చంపిన ఘటనలు చాలా ఉన్నాయి ఇప్పుడు కుర్చీ తాత బ్రతికుండగానే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఈ వార్తలను ఖండించారు.

Also Read: The Raja Saab: ది రాజా సాబ్ మ్యూజికల్ సర్ప్రైజ్.. ‘ రాజే యువరాజే’ ప్రోమో వైరల్!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×