E-Paper
Advertisement

The Raja Saab: ది రాజా సాబ్ మ్యూజికల్ సర్ప్రైజ్.. ‘ రాజే యువరాజే’ ప్రోమో వైరల్!

The Raja Saab: ది రాజా సాబ్ మ్యూజికల్ సర్ప్రైజ్.. ‘ రాజే యువరాజే’ ప్రోమో వైరల్!
Advertisement

The Raja Saab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ది రాజా సాబ్ ‘(The Raja Saab). సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 2026 జనవరి 9వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ  తరుణంలోనే సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు.. ఇటీవల ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సహనా అనే పాట విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిత్ర బృందం అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు.

రాజే యువరాజే ప్రోమో..

క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. ‘ రాజే యువరాజే'(Raje yuva raje) అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించిన సందడి చేయనున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ విభిన్నమైన కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంక్రాంతికి రాబోతున్న ది రాజా సాబ్..

Advertisement

ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చే సంక్రాంతి పండుగ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఇప్పటికే రెబల్, సహన అనే పాటలను విడుదల చేయగా తాజాగా రాజే యువరాజే అనే పాటకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. మరి జనవరి 9వ తేదీ రాబోతున్న ప్రభాస్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈయన చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ప్రభాస్ ఈ సినిమాతో పాటు మరిన్ని పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న ఫౌజీ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి డైరెక్షన్లో స్పిరిట్ సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో పాటు కల్కి, సలార్ సీక్వెల్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సీక్వెల్ సినిమాల షూటింగ్ మరి కాస్త ఆలస్యం అవుతాయని తెలుస్తోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఏంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Vithika Seru: గుడ్ న్యూస్ చెప్పిన వితికా .. మా జీవితంలోకి సంతోషం వచ్చిందంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×