E-Paper
Advertisement

Peddi Movie: పెద్ది మూవీలో కుషిత.. పోస్ట్ వైరల్

Peddi Movie: పెద్ది మూవీలో కుషిత.. పోస్ట్ వైరల్
Advertisement

Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది(Peddi). బుచ్చిబాబు సన (Bucchibabu Sana) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాల్సి ఉండగా.. సినిమా టికెట్ ధరల పెంపు కారణంగా ఈ సినిమాను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు.. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కుషిత (Kushita kallapu) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకోవడంతో.. ఇది కాస్త వైరల్ గా మారింది. మరి కుషిత షేర్ చేసిన ఆ పోస్టులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

పెద్ది సినిమాలో కుషిత..

సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి తర్వాతి కాలంలో తన గ్లామర్ తో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కుషిత కల్లాపు. రీల్స్ , ఫోటోషూట్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈమధ్య వెబ్ సిరీస్ లు , సినిమాలలో కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అందులో భాగంగానే గత ఏడాది రాజ్ తరుణ్ (Raj Tarun) సరసన చిరంజీవ అనే సినిమాలో నటించి.. నటిగా మంచి పేరు దక్కించుకున్న ఈమె.. ఇప్పుడు ఏకంగా ‘పెద్ది’ సినిమాలో భాగం అవడం ఆమె అదృష్టంగా భావిస్తోంది. ఈ మేరకు ఆసక్తికరమైన పోస్టు పంచుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ను రీషేర్ చేసింది.

పోస్టర్ తో హింట్..

Advertisement

సాధారణంగా నటీనటులు తాము నటిస్తున్న సినిమాల అప్డేట్స్ పై మాత్రమే ఇలా షేర్ చేస్తూ ఉంటారు. ఇక కుషిత కూడా అదే ఫాలో అవ్వడంతో ఈ చిత్రంలో ఈమె కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ విషయాన్ని ఇలా హింట్ ఇచ్చింది అని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండడం గమనార్హం.

ALSO READ:Bollywood: ప్రముఖ నటికి బెదిరింపులు.. రూ.10 కోట్లు ఇవ్వకపోతే?

నిజమైతే కెరియర్ కు టర్నింగ్ పాయింట్..

Advertisement

ఇకపోతే ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రానికి దర్శకుడిగా చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్కులో కనిపించగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో కుషితాకు అవకాశం లభించింది అంటే ఇక ఆమె కెరియర్ కు కచ్చితంగా ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పటికే “చికిరి చికిరి” సాంగ్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచేసింది. అటు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక త్వరలోనే రెండవ పాటను కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×