E-Paper
Advertisement

Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది. డిజైన్ అందిరింది భయ్యా!

Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది. డిజైన్ అందిరింది భయ్యా!
Advertisement

Renault Kwid Refresh Coming in 2026: ఇండియాలో బాగా పాపులర్ అయిన కార్లలో ఒకటి రెనాల్ట్ క్విడ్. 2024లో సెకెండ్ జెనరేషన్ కారుగా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. పెట్రో వెర్షన్ కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్ లో విడుదల అయ్యింది.   రెనాల్ట్ పాత డిజైన్‌ తో క్విడ్ ICE, కొత్త డిజైన్‌తో క్విడ్ E-టెక్ రెండింటినీ విక్రయిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెనాల్ట్  క్విడ్ పాత డిజైన్‌ను దశలవారీగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన స్పై షాట్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. క్విడ్ పాత డిజైన్ ICE వెర్షన్‌ కు అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

2026 రెనాల్ట్ క్విడ్ ఫేస్‌ లిఫ్ట్  

బ్రెజిల్‌ లో  రెనాల్ట్ రెండు క్విడ్ వెర్షన్లను అందిస్తుంది. క్విడ్, క్విడ్ E-టెక్. రెండూ విలక్షణమైన డిజైన్‌ తో అందుబాటులో ఉన్నాయి. ICE మోడల్ పాత డిజైన్ ఆధారంగానే కొనసాగుతోంది. అయితే, ఇటీవలి స్పై షాట్లు టెంపరరీ మ్యూల్‌ తో కూడిన టెస్ట్ మ్యూల్‌ను చూపుతున్నాయి.  ఇవి కొత్త అప్ డేట్స్ తో పాటు డిజైన్ లోనూ మార్పులు ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ టెస్ట్ మ్యూల్ పాత డిజైన్‌కు చెందినట్లుగా కనిపిస్తుంది. ఇది ICE వెర్షన్ కోసం మాత్రమే రిజర్వు చేయబడింది.

Advertisement

ఇందులో రెనాల్ట్ కొత్త లోగోతో పాటు దాని హెడ్‌ లైట్లు, DRL సిగ్నేచర్‌ కు చిన్న అప్‌ డేట్స్ కనిపిస్తున్నాయి. వెనుక భాగంలో కూడా కొంత మ్యూజ్‌మెంట్ ఉంది. ఇక్కడ కొత్త రెనాల్ట్ లోగోతో పాటు కొద్దిగా సవరించిన LED టెయిల్ లైట్ సిగ్నేచర్‌ ను పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్ట్ మ్యూల్ వెనుక బంపర్‌ లో దాని ఫాక్స్ స్కిడ్ ప్లేట్ లేదు. ఇది లో వేరియంట్‌ను సూచిస్తుంది. ఈ టెస్ట్ మ్యూల్‌ తో రేడియో యాంటెన్నా కనిపిస్తుంది. ప్రస్తుతం, బ్రెజిల్‌ లోని పాత డిజైన్ రెనాల్ట్ క్విడ్ ICE వెర్షన్ ముందు భాగంలో రెగ్యులేట్ యాంటెన్నాను కలిగి ఉంటుంది. ఈ అప్‌ డేట్ షార్క్ ఫిన్ యాంటెన్నాను వెనుక వైపు తిరిగి ఉంచుతుంది. అదే 1.0L ఎనర్జీ ఇంజిన్‌ను కొద్దిగా నవీకరించబడిన ఇంటీరియర్ పరికరాలతో పాటు కొనసాగించే అవకాశం ఉంది.

ఇండియన్ మోడల్‌కు కూడా అప్‌డేట్ వస్తుందా?

రెనాల్ట్ క్విడ్ భారత మార్కెట్లో బాగా పాపులర్ కారు. ప్రస్తుతం దాని ఫేస్‌ లిఫ్ట్  ఫస్ట్ జెనరేషన్ లో ఉంది. కంపెనీ కొత్త డిజైన్ ఆధారంగా ఎలక్ట్రిక్ మోడల్‌ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనిని  ఇప్పటికీ పలుమార్లు రహస్యంగా పరీక్షించారు. రెనాల్ట్ ఇండియా ICE, EV ప్రతి రూపాల మధ్య రెండు విభిన్న డిజైన్లతో బ్రెజిల్ మాదిరిగానే ఇక్కడ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత క్విడ్ దాని యాక్సెసరీస్ లో ఎక్కువ భాగాలను డస్టర్ నుంచి తీసుకుంది. క్విడ్ ICE మోడల్‌కు అప్ డేట్స్ మరింత మంచి లుక్ అందించే అవకాశం ఉంది. కానీ, కొత్త డిజైన్ గురించి రెనాల్ట్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. క్విడ్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో మారుతి సుజుకి S-ప్రెస్సో లాంటి కార్లకు గట్టి పోటీని అందిస్తుంది.

Advertisement

Read Also: ఫియట్ పద్మిని మళ్లీ వస్తుందా? అదీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×