E-Paper
Advertisement

Lalo Movie : 50 లక్షల బడ్జెట్ తో సినిమా చేస్తే 100 కోట్ల కలెక్షన్స్ ..ఇదేం క్రేజ్ సామీ!

Lalo Movie : 50 లక్షల బడ్జెట్ తో సినిమా చేస్తే 100 కోట్ల కలెక్షన్స్ ..ఇదేం క్రేజ్ సామీ!
Advertisement

Lalo Movie: ఇటీవల కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు . సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వందల కోట కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తున్నాయి.. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఉన్నాయి. ఇలా చిన్న సినిమాలు సాధించిన కలెక్షన్లు చూస్తే అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇదే కోవకు చెందినదే అని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి ఈ సినిమా ఏంటీ? అనే విషయానికి వస్తే..

చిన్న సినిమా.. పెద్ద సక్సెస్

అంకిత్ సఖియా దర్శకత్వంలో ఇటీవల గుజరాతిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం” ‘లాలో”(Lalo) రీవా రచ్, శృహద్ గోస్వామి, కరణ్ జోషిలు వంటి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటివారం పెద్దగా కలెక్షన్లను అందుకోలేకపోయిన ఈ సినిమా తదుపరి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా విడుదల అయ్యి 54 రోజుల వ్యవధిలోనే ఏకంగా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది అయితే ఈ సినిమా కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి ప్రస్తుతం 100 కోట్లు కలెక్షన్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులు..

Advertisement

ఈ సినిమా విడుదలకు ముందు ఏ విధమైనటువంటి అంచనాలు లేవు అదే విధంగా పెద్దగా ప్రమోషన్లను కూడా నిర్వహించలేదు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఒక సినిమా కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులే ఆ సినిమాని విజయపతంలో నడిపిస్తారు అనడానికి లాలో సినిమాని ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.

రిక్షా డ్రైవర్ కథ ఆధారంగా..

Advertisement

ఇక ఈ సినిమా ఒక రిక్షా డ్రైవర్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కథ మొత్తం రిక్షా డ్రైవర్ చుట్టూనే తిరుగుతుంది. ఇలా ఈ సినిమా విడుదలైన 50 రోజుల వ్యవధిలోనే 100 కోట్లను సాధించింది. ఇప్పటికైనా ఈ కలెక్షన్లకు పులి స్టాప్ పడుతుందా? లేదంటే ఇలా కలెక్షన్ల జోరు కనబరుస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని పెద్ద పెద్ద నిర్మాతలు తమ దోరని మార్చుకోవాలని మరికొందరు ఈ సినిమా కలెక్షన్లపై కూడా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కథ కంటే కూడా సినిమాలో స్టార్ సెలబ్రిటీలు నటించాలని దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. అయితే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే సరైన కంటెంట్ లేకపోతే సూపర్ స్టార్లు ఉన్న సినిమాలను ప్రేక్షకులు రిజెక్ట్ చేస్తారనే సంగతి తెలిసిందే.

Also Read: Big tv Kissik Talks: అలాంటివారికి పుట్టగతులు ఉండవు.. సర్వ నాశనం అవుతారు: ఇంద్రజ

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×