E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!

ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!
Advertisement

Kollywood: చిత్ర సీమలో వరుస విషాదాలు అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొంతమంది అనారోగ్యంతో మరణిస్తే.. మరికొంతమంది వయోభారంతో మరణిస్తున్నారు. ఇంకొంతమంది అర్ధాంతరంగా తనువు చాలిస్తూ అభిమానుల దుఃఖానికి కారణం అవుతున్నారు. ఈ క్రమంలోనే సరిగ్గా నలభై ఏళ్లు కూడా నిండకనే ఒక యువ నటుడు కన్నుమూయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఆ యువ నటుడు ఎవరు? అసలేం జరిగింది ?అనే విషయం ఇప్పుడు చూద్దాం..

పెదనాన్న మరణించిన కొన్ని రోజులకే కార్తీక్ మృతి..

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా నాలుగు వందలకు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించిన దేవా (Deva ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన కొన్ని రోజులకే ఆయన సోదరుడి కొడుకు కార్తీక్ చనిపోవడం ఇప్పుడు వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ నటుడు కార్తీక్ సబేశ్.

37 ఏళ్లకే తనువు చాలించిన కార్తీక్..

Advertisement

కార్తీక్ వయసు కేవలం 37 సంవత్సరాలు కావడం గమనార్హం . గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్తీక్ చెన్నైలో కన్నుమూశారు. ఇతడి తండ్రి సబేశ్, పెదనాన్న దేవా ఇద్దరూ మ్యూజిక్ డైరెక్టర్లుగా పనిచేశారు. ఇక కార్తీక్ విషయానికి వస్తే డ్రీమ్స్, వల్లవన్ (తెలుగులో వల్లభ), బర్మా, కాదల్ సొల్ల వందేన్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

కార్తీక్ నటించిన తెలుగు చిత్రాలు:

ఒక కార్తీక్ నటించిన తెలుగు చిత్రాల విషయానికి వస్తే తకిట తకిట, మొదలైంది ఇలా, ఉదయం ఎన్హెచ్ 4 వంటి చిత్రాలలో నటించారు. ఏది ఏమైనా పెదనాన్న దేవా మరణించిన కొన్ని రోజులకే కార్తీక్ కూడా మరణించడంతో కోలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి . కార్తీక్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Advertisement

also read: ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!

కుటుంబంలో వరద విషాదాలు..

ఇకపోతే గత ఏడాది అక్టోబర్లో కార్తీక్ తండ్రి సంగీత దర్శకుడు సబేష్ మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఈయన.. గత ఏడాది అక్టోబర్ 23న చెన్నైలో 68 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఇప్పుడు సరిగ్గా ఏడాది తిరిగేసరికి ఆయన కొడుకు కార్తీక్, సోదరుడు దేవా కూడా మరణించారు. మొత్తానికైతే ఒకే కుటుంబంలో వరుస విషాదాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Related News

ఆస్కార్ వేదికపై రామాయణ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!

వెన్నులో వణుకుపుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ 418 మూవీ ట్రైలర్!

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

Big Stories

Advertisement
×