E-Paper
Advertisement

ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!

ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!
Advertisement

Premalu 2 Movie: గిరీష్ ఏడి దర్శకత్వంలో మలయాళ బ్యూటీ మమిత బైజు (Mamitha Baiju), నస్లెన్ (Naslen) జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన చిత్రం ప్రేమలు. ఈ సినిమాతో నటీనటులకు ఊహించని గుర్తింపు లభించింది. ఒక్క మలయాళం ఇండస్ట్రీలోనే కాకుండా.. ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ జంటకు మంచి పేరు వచ్చింది. దీంతో ఈ సినిమాకి కొనసాగింపుగా సీక్వెల్ రాబోతున్నట్లు గతంలో డైరెక్టర్ గిరీష్ ప్రకటించినప్పటికీ.. ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ గిరీష్ స్పందించారు.

ప్రేమలు 2 ఆగిపోవడంపై డైరెక్టర్ క్లారిటీ..

ఒకవైపు సోషల్ మీడియాలో ప్రేమలు 2 ఆగిపోయిందని వస్తున్న వార్తపై గిరీష్ మాట్లాడుతూ.. “దాదాపు సంవత్సరం పాటు ప్రేమలు 2 ప్రాజెక్టు పైనే కష్టపడ్డాము. అయితే ఊహించని కారణాలవల్ల ఈ సినిమా అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. అది మా టీంకు చాలా పెద్ద షాక్. దీని వల్ల నాకు ఒక ఏడాది పాటు సమయం వృథా అయ్యింది. నిజానికి అంత సమయం వృథా చేయాల్సిన అవసరం లేదు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఈ కష్ట సమయంలో ప్రొడక్షన్ హౌస్ భావన స్టూడియోస్, రచయిత కిరణ్ జోషి తన వెంట నిలబడి తనను ప్రోత్సహించారని తెలిపారు. ఇకపోతే ఈ ప్రాజెక్టు కొన్ని కారణాలవల్ల ఆపేసామని చెప్పారు కానీ ఆ కారణాలు ఏంటి అనే విషయంపై డైరెక్టర్ క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

బెత్లెహెమ్ మూవీను పక్కనపెట్టి మరీ షూటింగ్..

ఇకపోతే ఈ సినిమా ఆగిపోయాకే నివిన్ పౌలి, మమితా బైజు కాంబినేషన్లో బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ గిరీష్. ఆయన ఈ విషయంపై కూడా స్పందిస్తూ..” బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మొదలు పెట్టడానికి ముందు ఏడాది పాటు ఈ సినిమా కోసం పనిచేశాను.. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. నిజానికి ప్రేమలు హిట్ అవ్వకముందే ఈ సినిమా తీయాలనుకున్నాను. కానీ ప్రేమలు సూపర్ హిట్ అయ్యేసరికి దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో పక్కన పెట్టాలనుకున్నాను. ఏడాది పాటు ఈ సినిమా కోసం పని చేశాను .కానీ ఆగిపోయింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గతేడాది విషు పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యేది.

Advertisement

also read: వెన్నులో వణుకుపుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ 418 మూవీ ట్రైలర్!

ఇండస్ట్రీ హిట్ కొడుతుందని అనుకోలేదు..

కానీ బెత్లెహెమ్ సినిమా దాని తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగాము. అయితే ఇంత పెద్ద హిట్ అయ్యి, ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందని నేనైతే ఊహించలేదు” అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ప్రేమలు మూవీ సీక్వెల్ ఆగిపోవడంపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

Related News

ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!

వెన్నులో వణుకుపుట్టిస్తున్న ప్రశాంత్ నీల్ 418 మూవీ ట్రైలర్!

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

Big Stories

Advertisement
×