E-Paper
Advertisement

రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సతీ లీలావతి’ ట్రైలర్ రిలీజ్..

రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సతీ లీలావతి’ ట్రైలర్ రిలీజ్..
Advertisement

Sathi Leelavathi Trailer: మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈమె నటించిన సతీ లీలావతి(Sathi Leelavathi) సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ మే 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రముఖ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

నువ్వు నన్ను ఏం చేయలేవు రా..

భార్య భర్తల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో లావణ్య త్రిపాఠి లీలావతి పాత్రలో నటించగా ఈమె భర్తగా నటుడు దేవ్ మోహన్(Dev Mohan) నటించారు. 20 ఏళ్ల జీవితంలో నీ మొహం పై కనిపించని నవ్వు నీ మూడేళ్ల సంసారంలో కనిపిస్తుంది అనే డైలాగ్ తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమవుతుంది. అయితే లీలావతి మాత్రం తన భర్తను కిడ్నాప్ చేసి తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా నటిస్తుంది. ఈ టైలర్ మొత్తం హాస్యాస్పదంగా కొనసాగుతుంది. ఇక చివరిలో లావణ్య త్రిపాఠి నువ్వు నన్నేం చేయలేవు రా అనే అరుంధతి డైలాగ్ చెప్పడంతో ఈ సినిమా మొత్తం పెళ్ళాం చేతిలో బలి అయ్యే భర్తగా ఉండబోతుందని తెలుస్తుంది.

పెళ్లి తర్వాత లావణ్య మొదటి చిత్రం..

Advertisement

ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ బ్యానర్ లో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగ మోహన్ నిర్మించగా, తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మరి పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుంది తన నటనతో మెగా కోడలు ప్రేక్షకులను మెప్పించగలరా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

Advertisement

ఈ సినిమా ట్రైలర్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేయడంతో సినిమా పట్ల మంచి అంచనాలు పెరిగిపోయాయి. ఇక సతి లీలావతి కోసం రామ్ చరణ్ ముందుకు రావడంతో లావణ్య త్రిపాఠి రామ్ చరణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసినందుకు రామ్ చరణ్ బావకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ లావణ్య త్రిపాఠి మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక చరణ్ ను ఈమె బావ అని సంబోధించడం హైలైట్ గా నిలిచింది. మరి మే8వ తేదీ రాబోతున్న సతీ లీలావతి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: కులం కారణంగా అవకాశాలు కోల్పోయిన నటుడు.. మరీ ఇంత క్యాస్ట్ ఫీలింగా?

Related News

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

సాహో ప్రపంచంలోకి ఓజీ..? ఏం ప్లాన్ చేస్తున్నావ్ సుజిత్ ?

మీరే నాకు స్ఫూర్తి… బాబాయ్ కు అబ్బాయ్ విషెస్!

ఒంటిమీద బట్టలు లాగేసి ఘోరంగా అవమానించారు – స్టార్ కమెడియన్ ఎమోషనల్!

పవన్ అభిమాని మృతి..గొప్ప మనసు చాటుకున్న ఎస్కేఎన్!

Big Stories

Advertisement
×