E-Paper
Advertisement

ఇన్వర్టర్ vs కన్వర్టబుల్ ఏసీలు.. రెండింటికీ తేడా ఏంటి? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?

ఇన్వర్టర్ vs కన్వర్టబుల్ ఏసీలు.. రెండింటికీ తేడా ఏంటి? మధ్యతరగతి ఇంటికి ఏది బెస్ట్?
Advertisement

Inverter vs convertible AC: ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఏఐ, వైఫై కనెక్టింగ్, వాయిస్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఇన్వర్టర్, కన్వర్టబుల్ ఏసీలు సైతం లభిస్తున్నాయి. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్వర్టర్, కన్వర్టబుల్ ఫీచర్లకు ఉన్న తేడా? అవి ఎలా పనిచేస్తాయి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంటి?

ఇన్వర్టర్ ఏసీలోని కంప్రెసర్ మోటార్ వేగం అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. గది ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు కంప్రెసర్ వేగం తగ్గుతుంది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆటోమేటిగ్గా వేగం పెరుగుతుంది. ఇది కంప్రెసర్‌ను పూర్తిగా ఆపకుండా నిరంతరం పనిచేసేలా చేస్తుంది. ఏసీ కంప్రెసర్ మాటిమాటికి ఆన్ లేదా ఆఫ్ అవ్వదు కాబట్టి.. నాన్ ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే 30-50 శాతం వరకూ విద్యుత్ అదా అవుతుంది. మరోవైపు కూలింగ్ పరంగా చూస్తే.. ఇది గదిలో స్థిరమైన చల్లదనాన్ని మెయింటెన్ చేస్తే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అయితే నాన్-ఇన్వర్టర్ ఏసీలతో పోలిస్తే వీటి ధర కొంచెం ఎక్కువ.

కన్వర్టబుల్ ఏసీ ఎలా వర్క్ చేస్తుంది?

Advertisement

కన్వర్టబుల్ ఏసీ అనేది ఇన్వర్టర్ టెక్నాలజీపైనే పనిచేస్తుంది. కానీ దీని ద్వారా కూలింగ్ కెపాసిటీని మార్చుకునే వెసులుబాటు వినియోగదారులకు లభిస్తుంది. ఉదాహరణకు 1.5 టన్ ఏసీ కొంటే దానిని అవసరాన్ని బట్టి 1 టన్ లేదా 0.8 టన్ లేదా 1.2 టన్‌గా మార్చుకోవచ్చు. గదిలో మనుషులు తక్కువగా ఉన్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తక్కువ కెపాసిటీ ఉన్న మోడ్ ను ఎంచుకోవడం ద్వారా విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే వినియోగదారుడు తమ అవసరానికి అనుగుణంగా కూలింగ్ ను మార్చుకునే సౌకర్యం దీని ద్వారా లభిస్తుంది.

Also Read: Kavitha Press Meet: కేసీఆర్‌ను తండ్రిగా కాదు.. రాజకీయ నేతగా విమర్శించా.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు!

కొనేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకొండి..

Advertisement

ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్, కన్వర్టబుల్ ఫీచర్లు కలగలిసిన ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకోవడం ద్వారా మెరుగైన కూలింగ్ తో పాటు, విద్యుత్ ఆదాను పొందొచ్చు. అయితే ఏసీ కొనేటప్పుడు కొన్ని విషయాలను ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలనే ఎంచుకుంటే విద్యుత్ బిల్లు భారం తగ్గుతుంది. అల్యూమినియం కాయిల్ కంటే కాపర్ కాయిల్ ఉన్న ఏసీలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఏసీ అమర్చాలని భావిస్తున్న గది పరిమాణాన్ని బట్టి ఏసీ సామర్థ్యాన్ని ఎంచుకోవడం బెటర్. ఒకవేళ బెడ్ రూమ్ కోసం అయితే తక్కువ నాయిస్ ఉన్న ఏసీని తీసుకుంటే రాత్రిళ్లు హాయిగా నిద్రపోవచ్చు.

Also Read: రెండ్రోజుల్లో బెంగాల్ ఫలితాలు.. సీఎం మమతా కీలక నిర్ణయం.. కౌంటింగ్ ఏజెంట్లతో అత్యవసర భేటి!

Related News

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

Big Stories

Advertisement
×