E-Paper
Advertisement

Lavanya Tripathi: రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న లావణ్య..మంచి పనే చేసిందంటూ!

Lavanya Tripathi: రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వదులుకున్న లావణ్య..మంచి పనే చేసిందంటూ!
Advertisement

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతీ లీలావతి సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత లావణ్య నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ప్రమోషన్లలో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. నిజానికి ఈ సినిమా మార్చి 6 వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో లావణ్య త్రిపాఠి పాల్గొనడంతో అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన సినిమాల గురించి తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను తెలియచేశారు.

బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న లావణ్య..

సాధారణంగా నటీనటులు అన్న తర్వాత కొన్నిసార్లు మంచి సినిమా అవకాశాలు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే కొన్ని వదులుకున్న సినిమాలు డిజాస్టర్ కావడంతో భారీ ఫ్లాప్స్ నుంచి బయటపడిన వారు కూడా ఉన్నారు. ఇలా లావణ్య కెరియర్ లో కూడా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారని తెలుస్తుంది.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా లావణ్యను ప్రశ్నిస్తూ ఏదైనా సినిమాలను రిజెక్ట్ చేసి రిగ్రేట్ గా ఫీల్ అయ్యారా? అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు లావణ్య సమాధానం చెబుతూ ఇప్పటివరకు తాను సినిమాలను రిజెక్ట్ చేయలేదని అలాగే సినిమాల విషయంలో ఎలాంటి రీ గ్రేట్ కూడా లేదని తెలిపారు.

లావణ్య మిస్ చేసుకుంటే రష్మిక హిట్ కొట్టింది..

Advertisement

లావణ్య మాట్లాడుతూ తాను ఒక సినిమాకు ముందు నో చెప్పాను కానీ తర్వాత ఎస్ చెప్పినప్పటికీ ఆ సినిమా ఛాన్స్ కోల్పోయానని తెలిపారు. ఆ సినిమాలో రష్మిక నటించిన సూపర్ సక్సెస్ అందుకుందనే విషయాన్ని తెలిపారు. మరి లావణ్య వదులుకున్న ఆ సూపర్ హిట్ సినిమా మరేదో కాదు విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన మొట్టమొదటి చిత్రం గీత గోవిందం. మొదట గీతగోవిందం సినిమా కోసం లావణ్య త్రిపాఠిని సంప్రదించగా ఈమె కథ వినకముందు నో అని చెప్పారట. కథ విన్న తర్వాత ఈ సినిమా చేయటానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు.

గీత గోవిందం ఫస్ట్ ఛాయిస్ లావణ్య త్రిపాఠి..

Advertisement

ఇలా కథ విన్న తర్వాత సినిమాలో నేను నటిస్తానని చెప్పినప్పటికీ ఈ సినిమా విషయంలో ఏదేదో జరిగి చివరికి రష్మిక (Rashmika)వద్దకు వెళ్లిందని లావణ్య త్రిపాఠి తెలిపారు. కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుతుదని ఇప్పుడు వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అంటూ కొత్త జంటకు అభినందనలు తెలిపారు. గీత గోవిందం (Geetha Govindam)సినిమాకు ఫస్ట్ ఛాయిస్ లావణ్య త్రిపాఠి అనే విషయం తెలియడంతో రష్మిక విజయ్ అభిమానులు లావణ్య ఈ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేశారని లేకపోతే విజయ్, రష్మిక వ్యక్తిగత జీవితంలో ఒకటి కాలేకపోయేవారు అంటూ ఈ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. గీత గోవిందం సినిమాలో నటించిన వీరిద్దరు డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఇలా ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.

Also Read: Lavanya Tripathi: మొదటి సారి వరుణ్ ను చూడగానే లావణ్య ఫీలింగ్ ..పడిపోయానంటూ!

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×