E-Paper
Advertisement

Mahesh Babu: స్పెషల్ డే.. తండ్రిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన మహేష్

Mahesh Babu: స్పెషల్ డే.. తండ్రిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన మహేష్
Advertisement

Mahesh Babu: నేడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత పెద్ద స్పెషల్ డేనో అందరికీ తెలుసు. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేసే వేడుక  మరి కొద్దీ గంటల్లో మొదలుకానుంది. ప్రపంచం మొత్తం ఈ ఈవెంట్ వైపే చూస్తోంది. ఎప్పుడెప్పుడు మహేష్.. ఆ వేదికపై నిలబడతాడా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ అద్భుతమైన క్షణాన్ని చూడడానికి మహేష్ తల్లిదండ్రులు లేకపోవడం ఎంతో బాధాకరం. అందులోనూ ఈ స్పెషల్ రోజునే మహేష్ బాబు తండ్రి కృష్ణ వర్ధంతి కూడా కావడం మరింత బాధాకరం.

తండ్రి కృష్ణను మహేష్ ఎప్పుడు మర్చిపోలేదు. నిత్యం మహేష్ తన తండ్రి కృష్ణను తలుచుకుంటూనే ఉంటాడు. నేడు తన జీవితంలో జరుగుతున్న అద్భుతమైన వేడుకను చూడడానికి తండ్రి లేడు అనే బాధ మహేష్ లో ఇప్పటికీ ఉంది. తాజాగా ఆయన తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. నేడు కృష్ణ వర్థంతి కూడా కావడంతో మహేష్ తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. తన గురించి ఆలోచిస్తూనే ఉన్నాను అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు.

Advertisement

కృష్ణ- మహేష్ బాబు కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలోని స్టిల్  ను షేర్ చేస్తూ.. ” నువ్వు గర్వంగా ఉంటావని తెలిసి కూడా ఈరోజు నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. కొడుకు పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు.. దానికి ఈరోజు జరిగే వేడుకే నిదర్శనం. ఈ సమయంలో కనుక కృష్ణ ఉంటే కచ్చితంగా పుత్రోత్సాహంతో ఉబ్బితబ్బిబైపోయేవారు అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయినా కూడా కృష్ణ ఆశీర్వాదాలు ఎప్పుడు మహేష్ కు ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

కృష్ణ మరణం తరువాత ఒంటరి అయిన మహేష్ కు అన్ని అభిమానులే అయ్యారు. మహేష్ సైతం.. మీరే నాకు అన్ని అని స్టేజి మీదనే చెప్పడంతో అభిమానులు చలించిపోయారు. ఇక నుంచి మహేష్ కు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా దేశాన్ని తగలబెట్టేస్తాం అనే రేంజ్ లో చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్లే చూసుకుంటున్నారు కూడా. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో కూడా మహేష్ స్పీచ్.. తన తండ్రి కృష్ణ మాటతోనే మొదలుపెట్టనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి ఈ ఈవెంట్ లో మహేష్ తండ్రిని తలుచుకొని కంటతడి పెట్టి.. అభిమానులను కూడా కంటతడి పెట్టిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×