E-Paper
Advertisement

Healthy Breakfast: ఉదయాన్నే పొట్టలో ఏదోఒకటని తోసేస్తున్నారా?.. బ్రేక్‌ఫాస్ట్‌పై హార్వర్డ్ నిపుణుల సలహా ఇదే!

Healthy Breakfast: ఉదయాన్నే పొట్టలో ఏదోఒకటని తోసేస్తున్నారా?.. బ్రేక్‌ఫాస్ట్‌పై హార్వర్డ్ నిపుణుల సలహా ఇదే!
Advertisement

Healthy Breakfast: మనం నిద్రలేచాక ఉదయం పూట మొదటగా తీసుకునే ఆహారమే.. ఆ రోజంతటికీ ఇంధనంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఏదో ఒకటి పొట్టలోకి తోసేస్తే అయిపోతుంది అనుకోవద్దు. ఈ అలవాటు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయని హెచ్చరిస్తున్నారు హార్వర్డ్‌కు చెందిన పోషకాహార నిపుణులు. ఉదయం అల్పాహారంగా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. అల్పాహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సినవి కొన్నున్నాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అల్పాహారంలో పీచు తప్పనిసరి:

ప్రతిరోజూ ఉదయం పూట తీసుకునే ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు గానూ సాధారణ టిఫిన్స్ కంటే.. రాగులు, జొన్నలు, సజ్జలతో చేసిన బ్రెడ్‌లు, అటుకులు, ఓట్‌మీల్‌ వంటివి చక్కని ప్రత్యామ్నాయాలని సలహా ఇస్తున్నారు పోషకాహార నిపుణులు.

విటమిన్లు అత్యవసరం:

Advertisement

ఉదయం అల్పాహారంలో పీచు తీసుకున్న తర్వాత.. మనం తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. వీటి కోసం మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకోవాలి. అలాగే రోజులో ఏదో ఒక సమయంలో ఉడకబెట్టిన గుడ్లు తీసుకోవడం తప్పనిసరి. వీటి ద్వారా మన శరీరానికి మాంసకృత్తులతోపాటూ అత్యవసర విటమిన్లు, ఖనిజాలు కూడా అందుతాయి.

ఏదో ఒకటి అనుకోవద్దు:

బ్రేక్‌ఫాస్ట్ అనగానే.. చాలామందికి ఉండే సాధారణ అలవాటు బయట తినేయడం. ఇంట్లో చేసుకోవడం ఎందుకులే అని కొందరు, టైం లేక మరికొందరు అస్తమానం బయట తినేస్తుంటారు. కానీ, ఇది మంచి పద్ధతి కాదని, బయట తినే ఆహారంలో ఉప్పు, నూనెల మోతాదు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి.. పోషకాలతో కూడిన అల్పాహారం ఇంట్లోనే తినడం ఉత్తమం.

బోలెడు ప్రత్యామ్నాయాలు:

Advertisement

శారీరక శ్రమ చేసేవాళ్లు, జిమ్, యోగా వంటివి చేసేవాళ్లు ఉదయం అల్పాహారంగా మరిన్ని ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవాలి. దీని కోసం తాజా పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఆమ్లెట్‌, బాదం.. అక్రోట్‌ వంటివి తీసుకోవచ్చు. వీటితోపాటు బాదం వంటి ఎండు పప్పులని కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

Related News

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

Big Stories

Advertisement
×