E-Paper
Advertisement

Varanasi: విదేశాలకు చెక్కేస్తున్న మహేష్ బాబు, మళ్లీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Varanasi: విదేశాలకు చెక్కేస్తున్న మహేష్ బాబు, మళ్లీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే
Advertisement

Varanasi: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకం. ఒకవైపు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోవైపు తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడైనా మహేష్ బాబు కి కొద్దిపాటి గ్యాప్ దొరికితే చాలు ఖచ్చితంగా విదేశాలకు ట్రిప్ కు వెళ్ళిపోతారు. కేవలం మహేష్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ అందరితో కూడా ట్రిప్ కు వెళ్లడం అనేది మహేష్ బాబుకి అలవాటు. అందుకే మహేష్ బాబు ఫొటోస్ ఎక్కువగా ఎయిర్పోర్టులో దర్శనమిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేశారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే చాలా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ బాబుని లాక్ చేస్తున్నట్లు అతని పాస్పోర్ట్ కూడా కలెక్ట్ చేశారు రాజమౌళి. ఆ వీడియో అప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

విదేశాలకు మహేష్ బాబు 

Advertisement

ప్రస్తుతం వారణాసి సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూనే ఉంది. మొత్తానికి గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్స్ జరిగిన తర్వాత ఇప్పుడు షెడ్యూల్ బ్రేక్ వచ్చింది. ఈ షెడ్యూల్ బ్రేక్ లో భాగంగా మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు విదేశాలకు వెళ్తున్నారు.

ఇప్పుడు జరగబోయే షెడ్యూల్ కోసం రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్లాన్ అయిన తర్వాత మహేష్ బాబు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే పాస్పోర్ట్ వలన ఈ సినిమా టాపిక్ విపరీతంగా వైరల్ అయింది అందుకే ఈవెంట్ కి సంబంధించి కూడా ఒక పాస్పోర్ట్ తోనే హై క్రియేట్ చేస్తూ పాసెస్ లా వాటిని వాడారు.

భారీ అంచనాలు 

Advertisement

ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. 2027 ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ఎం ఎం కీరవాణి అనౌన్స్ చేశారు. అయితే 2027 ఏప్రిల్ నెలలో శ్రీరామనవమి వేడుక ఉంది. అందులో భాగంగానే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సంచారి అనే పాట విపరీతంగా వైరల్ అయింది. ఒక పాటతోనే సినిమా మీద హైప్ క్రియేట్ చేశారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి వరల్డ్ ఎలా ఉండబోతుంది అని మూడు నిమిషాల పాటు సాగే ఒక వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ వీడియో సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచేసింది.

కేవలం సినిమా కమర్షియల్ గా ఉండటం మాత్రమే కాకుండా మైథాలజీకి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ప్రస్తావించబోతున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో రివిల్ చేయనున్నారు.

Also Read : Anudeep KV: సుమతో అనుదీప్ 100 కోట్ల సినిమా? దివాలా తీయడం ఖాయం

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×