E-Paper
Advertisement

Papaya Tree: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండకూడదా?

Papaya Tree: ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండకూడదా?
Advertisement

మన ఇళ్ల దగ్గర ఏ చెట్లు నాటాలి? ఏవి నాటకూడదు? అనే విషయంపై చాలా మంది సందేహాలు పడుతుంటారు. ముఖ్యంగా ఇంటి ముందు బొప్పాయి చెట్టు ఉండకూడదు అని పెద్దలు చెప్పడంతో వినే ఉంటారు. ఇది నిజమేనా? లేక కేవలం పాత నమ్మకమేనా? అని ఆలోచిస్తారు. అసలు బొప్పాయి చెట్టు ఇంటి ముందర ఉంటే ఏమైనా సమస్య వస్తుందా?

బొప్పాయి చెట్టు నాటకూడదట
పూర్వం నుంచి పెద్దలు చెప్పే మాట ఏమిటంటే ఇంటి ముందర బొప్పాయి చెట్టు నాటకూడదు. ఎందుకంటే బొప్పాయి చెట్టు త్వరగా పెరుగుతుంది. పండ్లు ఎక్కువగా పుడతాయి, కొన్ని సార్లు పాడై పడిపోతే వాసన వస్తుంది. అప్పట్లో ఈ వాసనను చెడు శకునంగా భావించేవారు. పైగా బొప్పాయి ఆకులు ఎక్కువగా ఎండి తరచూ కింద పడుతుంటాయి. ఇవి ఇంటి ముందు చెదురుమదురు అయితే ఇల్లు అశుభ్రంగా కనబడుతుంది. అలాగే, పాతకాలంలో ఇంటికి సూర్యకిరణాలు సరిగా రావాలంటే ముందు భాగం ఖాళీగా ఉండాలని నమ్మకం ఉండేది. బొప్పాయి చెట్టు నీడ ఆ కాంతిని అడ్డుకుంటుందని భావించి ఆ చెట్టు ఉండకూడదని చెబుతారు. పాత నమ్మకాలపై ఆధారపడ్డ అభిప్రాయాలే.

Advertisement

కానీ శాస్త్రీయ కారణాల ప్రకారం చూస్తే బొప్పాయి చెట్టు వల్ల ఇంటికి పెద్ద సమస్యలు రావు. బొప్పాయి చెట్టు వేర్లు బలంగా విస్తరించవు కాబట్టి ఇంటి గోడలకు, ఫౌండేషన్ కు హాని చేసే అవకాశం చాలా తక్కువ. అలాగే చెట్టు పెద్ద నీడ కూడా ఇవ్వదు. అసలు సమస్య ఏంటంటే చెట్టు దగ్గర పరిశుభ్రత పాటించకపోతే పండ్లు పడిపడి పురుగులు రావడం లేదా దుర్వాసన రావడం జరుగుతుంది. ఇది చెట్టు కారణం కాదు, శుభ్రం చేయకపోవడం వల్లే. అలాగే బొప్పాయి చెట్టు నీటి దగ్గర ఉండడం ఇష్టపడుతుంది. అక్కడ నీరు నిలిచిపోతే దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే సరైన శుభ్రత, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చెట్టుతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొందరు భయపడే చెడు శకునం అనేది అసలు శాస్త్రీయంగా నిజం కాదు.

వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇప్పటి వాస్తు నిపుణులు కూడా బొప్పాయి చెట్టును పూర్తిగా నిషేధించరు. కానీ ఇంటి గుమ్మం దగ్గర చాలా దగ్గరగా నాటితే ప్రవేశద్వారం కాస్త అడ్డంగా కనిపించవచ్చు, కాంతి తగ్గవచ్చు. అందుకే ఇంటి ముందు వద్దని చెబుతారు. అయితే ఇంటికి పక్కనా, కొద్దిదూరంలోనైనా లేదా వెనకభాగంలోనైనా నాటితే ఎలాంటి సమస్య ఉండదు. పైగా బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చెట్టు చిన్నదే కాబట్టి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. అందువల్ల బొప్పాయి చెట్టును అపశకునంగా భావించి దూరం పెట్టాల్సిన అవసరం లేదు. సరైన ప్రదేశంలో నాటితే, శుభ్రత పాటిస్తే ఇది ఇంటికి హాని కాదు, బాగా ఉపయోగపడే చెట్టే. కాబట్టి పాత నమ్మకాల కంటే నిజమైన కారణాలను చూసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×