E-Paper
Advertisement

Mahesh Babu: మహేష్ బాబు వదులుకున్న టాప్ 10 బ్లాక్ బస్టర్ ఇవే!

Mahesh Babu: మహేష్ బాబు వదులుకున్న టాప్ 10 బ్లాక్ బస్టర్ ఇవే!
Advertisement

Mahesh Babu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమాల ఎంపిక చాలా వైవిధ్యంగా ఉంటుంది. కథ నచ్చితేనే ప్రాజెక్ట్ ఓకే చేసే మహేష్, తన కెరీర్‌లో కొన్ని సినిమాలను సున్నితంగా తిరస్కరించారు. అయితే చిత్ర విచిత్రం ఏమిటంటే, ఆయన వద్దన్న ఆ కథలు వేరే హీరోల దగ్గరకు వెళ్లి ఇండస్ట్రీ హిట్ లుగా, బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఒకవేళ ఆ సినిమాలు మహేష్ చేసి ఉంటే ఆయన కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేదేమో అని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. మరి మహేష్ మిస్ చేసుకున్న ఆ పది భారీ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

పాన్ ఇండియా క్రేజ్ తెచ్చే సినిమాలను కూడా:

నేడు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘పుష్ప’ కథను సుకుమార్ మొదట మహేష్ బాబుకే వినిపించారు. కానీ ఆ క్యారెక్టర్ తనకు సెట్ అవ్వదని మహేష్ నో చెప్పారు. అలాగే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ కథతో మహేష్‌ను కలిశారు, కానీ తన ఇమేజ్‌కు అది చాలా భిన్నంగా ఉండటంతో ఆయన వదులుకున్నారు. ఇక షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘జవాన్’ కథ కూడా అట్లీ మొదట మహేష్‌కే చెప్పారు. ఇలా మన సూపర్ స్టార్ వద్దన్న సినిమాలు ఇప్పుడు నేషనల్ లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం విశేషం.

క్లాసిక్ హిట్స్.. మహేష్ కాదన్న తర్వాతే:

Advertisement

మహేష్ బాబు కేవలం మాస్ సినిమాలే కాదు, కొన్ని అద్భుతమైన లవ్ స్టోరీలను కూడా వదులుకున్నారు. శేఖర్ కమ్ముల ‘ఫిదా’, గౌతమ్ మీనన్ ‘ఏం మాయ చేసావే’ వంటి క్లాసిక్ హిట్స్ మొదట మహేష్ దగ్గరికే వచ్చాయి. అలాగే మురుగదాస్ ‘గజిని’, విక్రమ్ కుమార్ ’24’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను కూడా ఆయన మిస్ చేసుకున్నారు. ఇవే కాకుండా కెరీర్ ప్రారంభంలో ‘ఇడియట్’, ‘వర్షం’ వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ కూడా మహేష్ కాదన్న తర్వాతే వేరే హీరోల వద్దకు వెళ్లి సూపర్ హిట్ లుగా నిలిచాయి.

also read:Shiva Rajkumar: కన్నడ ముద్దుగుమ్మల పోరాటానికి శివన్న మద్దతు!

అన్నీ ఉన్నా.. కథే ముఖ్యం:

Advertisement

మహేష్ బాబు ఒక సినిమాను తిరస్కరించారంటే దానికి బలమైన కారణం ఉంటుంది. కొన్నిసార్లు డేట్స్ కుదరకపోవడం, మరికొన్ని సార్లు ఆ పాత్ర తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ కాదని భావించడం వల్ల ఆయన వద్దని చెబుతుంటారు. ఇక తాను మిస్ చేసుకున్న సినిమాలు హిట్ అయినా, ఆయన మాత్రం ఎప్పుడూ బాధపడరు. తనకు నచ్చిన కథలతో ‘పోకిరి’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’ గుంటూరు కారం, వంటి ఇండస్ట్రీ హిట్లను అందుకుని, తన సత్తా చాటుతూనే ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళితో చేయబోయే సినిమాతో గ్లోబల్ లెవల్లో రికార్డులు సృష్టించేందుకు మహేష్ సిద్ధమవుతున్నారు.

Related News

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఆ రూమర్స్ కు చెక్..

Big Stories

Advertisement
×