Mahi Gill: అయితే చేతిలో సిగరెట్టు, లేదంటే మందు గ్లాసు, ఇక ఎప్పుడూ గ్లామర్ ఒలకబోస్తూ ఒంటిపై చీరకట్టు.ఇలా ఎన్నేళ్ళుగా ఇదే తరహ పాత్రలు వేయాలి, ఇక నుండి ఆ గ్లామర్ రోల్స్ వద్దు బాబోయ్ అంటూ మరో అవతారం ఎత్తేసింది బాలీవుడ్ బ్యూటీ మహీ గిల్.అవును లేటెస్ట్ గా వస్తున్న ‘రక్తాంచల్ 3’లో అనే పాపులర్ సిరీస్ లో సరికొత్తగా సరస్వతి దేవి అవతారం ఎత్తేసింది మహి.ఇక ఈ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో ప్రసారమవుతున్న స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా ఈ తన కెరీర్ అండ్ లైఫ్ లో ఎదుర్కున్న పలు ఆసక్తి కరమైన సంగతులని ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.
గ్లామర్ రోల్సే ఎక్కువ
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో గ్లామర్ రోల్సే ఎక్కువ వచ్చేవని, ఎక్కువగా చేతిలో సిగరెట్, మందు గ్లాస్, చీర కట్టు అంటూ వేయించిన పాత్రలే మళ్ళీ మళ్ళీ వేయించి బోర్ కొట్టించారని చెప్పుకొచ్చింది.వాటి నుండి అసలు ఎప్పుడెప్పుడు బయటపడతానా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానని ఎట్టకేలకి వాటన్నింటిని దాటుకొని ‘రక్తాంచల్ 3’లో సరస్వతి దేవి అనే చాలెంజింగ్ క్యారెక్టర్ ద్వారా దాని బ్రేక్ చేయగలిగానని చెప్పుకొచ్చింది.
ఇక 2020లో వచ్చిన ‘రక్తాంచల్’ మొదటి సీజన్ సూపర్ హిట్ అవడంతో ఈ సిరీస్‌కు మంచి క్రేజ్ ఏర్పడిందని,ఇక మూడో భాగంలో తన పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది ఈ బీటౌన్ బ్యూటీ.
ఇండస్ట్రీలో ఏకంగా నాలుగేళ్ల పాటు
ఇక తన వ్యక్తిగత కారణాల వల్లే ఇండస్ట్రీలో ఏకంగా నాలుగేళ్ల పాటు ఎలాంటి సినిమాలు చేయలేకపోయానని,అదే సమయంలో మంచి మంచి సినిమాలు మిస్ అయ్యాయని మనసులోని బాధని బయటపెట్టింది,అయితే అలా ఆఫర్స్ పోయినందుకు రిగ్రేట్ గా ఏం లేదని ,దేనికైనా సరైన సమయం రావాల్సిందే అని,ఇక తన ఫోకస్ అంతా ముందున్న ప్రాజెక్ట్స్ పైనే అని తేల్చి చెప్పింది 50 ఏళ్ల ఈ వెటరన్ బ్యూటీ.
ఇక ఇదే క్రమంలో డిజిటల్ రెవెల్యూషన్ పై మాట్లాడుతూ ottలు రావడం వల్ల కొత్త కొత్త కథలు వస్తున్నాయని, ప్రతి ఒక్కరికి అవకాశాలు పెరిగిపోయాయని,ముఖ్యంగా లేడీ ఆర్టిస్ట్ లకి మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది.ఇక ఇదే క్రమంలో అసలు ott కోసం తీసేవాటికి, సిల్వర్ స్క్రీన్ కోసం తీసేవాటికి పెద్దగా తేడా లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
సినిమాల విషయానికి వస్తే
ఇక మహి గిల్ సినిమాల విషయానికి వస్తే ‘దేవ్ డి’ (2009)తో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ ఆ తర్వాత ‘సాహెబ్ బివి ఔర్ గ్యాంగ్‌స్టర్’ (2011) ఫ్రాంచైజీ, ‘పాన్ సింగ్ తోమర్’ (2012), ‘దబాంగ్’ (2010) వంటి భారీ చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెల్సిందే.అలాగే 2020లో వచ్చిన ‘దుర్గమతి’లోనూ ఒక ఇంటెన్స్ రోల్‌తో ఆకట్టుకున్న ఈ భామ తాజగా మరోసారి ‘రక్తాంచల్ 3’లో ఇప్పుడు సరస్వతి దేవిగా లీడ్ రోల్‌లో మెప్పించడానికి రెడీ అయింది.ఏది ఏమైనా ఒకప్పుడు గ్లామర్ రోల్స్ కే పరిమితమైన ఈ వెటరన్ బ్యూటీ ఇపుడు చాలెంజింగ్ రోల్స్ ని దక్కించుకోవడం విశేషం !