న్యూమరాలజీ ప్రకారం ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. కొన్ని సంఖ్యల కలయికలు మరింత శుభప్రదంగా భావిస్తారు. అవి వ్యక్తి జీవితంలో విజయం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతికి సహాయపడతాయని నమ్మకం.
1, 10, 19 లేదా 28 తేదీల్లో జన్మించిన వారి మూల అంకం (జన్మ సంఖ్య) 1 అవుతుంది. న్యూమరాలజీలో ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. అందుకే వీరు సహజ నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం, లక్ష్యసాధన వంటి గుణాలను కలిగి ఉంటారు.
న్యూమరాలజీ ప్రకారం మూల అంకం 1 వారికి భాగ్యాంకాలు 1, 3, 5 మంచి ఫలితాలను ఇస్తాయని భావిస్తారు. ఈ సంఖ్యలు వారి ఎదుగుదలకు, ఆత్మవిశ్వాసానికి బలాన్నిస్తాయని నమ్మకం. అంటే మూల అంకం 1 ఉన్నవారికి మూల అంకం 1,3, 5 ఉన్నవారు అదృష్టం తీసుకువస్తారు.
అయితే భాగ్యాంకం 9, మూల అంకం 1 పవర్‌ఫుల్ కాంబినేషన్. ఇది అత్యంత శక్తివంతమైన కలయికగా చాలామంది న్యూమరాలజీ నిపుణులు పేర్కొంటారు. ఈ కలయిక విజయాన్ని, ధైర్యాన్ని, పట్టుదలను పెంచుతుంది.
అంకశాస్త్రం ప్రకారం మూల అంకం 1కి సూర్యుడు అధిపతి అయితే.. భాగ్యాంకం 9కి కుజుడు అధిపతి. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ రెండు గ్రహాల శక్తులు ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయి.
సూర్యుడు నాయకత్వాన్ని, దూరదృష్టిని సూచిస్తాడు. కుజుడు ధైర్యం, కార్యాచరణ, సంకల్పానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రెండు శక్తులు కలిసి వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని నమ్మకం.
ఈ సంఖ్యల కలయిక ఉన్నవారు పెద్ద లక్ష్యాలను ఎంచుకోవడానికి వెనుకాడరని అంకశాస్త్రం చెబుతుంది. వారు కష్టపడి పనిచేస్తూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు.
వ్యాపారం, మేనేజ్‌మెంట్, నాయకత్వం, పరిపాలన వంటి రంగాల్లో మంచి అవకాశాలు పొందవచ్చని నమ్మకం. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం వీరికి బలంగా మారుతుందని చెబుతారు.
అంకశాస్త్ర విశ్వాసాల ప్రకారం ఈ కలయిక ఆర్థిక స్థిరత్వానికి సహాయపడవచ్చు. వీరు నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారని చెబుతారు.
సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ లక్షణం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని న్యూమరాలజీ అనుచరులు విశ్వసిస్తారు.
Also Read: తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస
మూల అంకం 1, భాగ్యాంకం 9 కలిగినవారు మానసికంగా బలంగా ఉంటారని అంకశాస్త్రం చెబుతుంది. పజయాలను చూసి వెనక్కి తగ్గకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వారి ప్రధాన బలంగా భావిస్తారు. అదే వారికి విజయానికి మార్గం చూపుతుందని విశ్వాసం.
గమనిక: ఇక్కడ తెలిపిన సమాచార మంతా న్యూమరాలజీ సంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడిన విధానం మాత్రమే. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తి విజయం కృషి, నైపుణ్యం, అవకాశాలు, సరైన నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది.