E-Paper
Advertisement

Malaika Arora: తనకంటే చిన్నవాడితో మలైకా డేటింగ్.. పిచ్చి కూ*త*లు ఆపరా అంటూ ఫైర్!

Malaika Arora: తనకంటే చిన్నవాడితో మలైకా డేటింగ్.. పిచ్చి కూ*త*లు ఆపరా అంటూ ఫైర్!
Advertisement

Malaika Arora:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాల కంటే కూడా వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొంటూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్న మలైకా అరోరా (Malaika Arora) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా వయసులో తనకంటే చిన్నవాళ్లతో ఎప్పుడూ డేటింగ్ చేస్తోంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత వారసుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) తో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ . 2018లో మొదలైన వీరి బంధం అనూహ్యంగా 2024లో బ్రేకప్ అయ్యింది.

మళ్లీ డేటింగ్ లో మలైకా అరోరా..

ఇకపోతే అప్పటినుంచి ఎవరికి వారు విడిగానే ఉంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో గత కొంతకాలంగా ఈమె హర్ష్ మెహతా, సోరబ్ బేడి లతో అప్పుడప్పుడు కలసి కనిపించడంతో మళ్లీ తనకంటే వయసులో చిన్న వారితో మలైకా అరోరా డేటింగ్ చేస్తోంది అంటూ పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లకు విసిగిపోయానని తెలిపిన మలైకా అరోరా అందుకు తగ్గట్టుగానే గట్టి సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఒక్క స్టేట్మెంట్ తో స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి వార్తలు వస్తే మాత్రం కొంతమంది వెంటనే స్పందించి సరైన సమాధానం చెబుతూ ఉంటారు. ఇంకొంద మంది కంగారు పడిపోతారు. కానీ మలైకా మాత్రం చాలా కూల్ గా స్పందించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.. మలైకా మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కూడా నన్ను ఎవరో ఒకరితో ముడి పెట్టడం నిజంగా చిరాకు తెప్పిస్తోంది. అయితే ఇప్పుడు నేను వాటిని ఒక జోక్ లాగా చూస్తున్నాను. నా కొడుకు అర్హాన్ ఖాన్, నేను కలసి కూర్చొని ఈ పిచ్చి కూతలను, వార్తలను చూసి తెగ నవ్వుకుంటున్నాము. నిజానికి నా కొడుకుకు నాకు మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. నేను ఒక సింగిల్ మదర్ గా ఉన్నప్పటికీ నా సామ్రాజ్యాన్ని నేనే నిర్మించుకున్నాను.

also read:Hey Balwanth: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న సుహాస్-శివాని హే బల్వంత్.. ఆ రోజు నుంచే అందుబాటులోకి!

ఒకరిపై ఆధారపడి బ్రతకాల్సిన అవసరం నాకు లేదు..

Advertisement

చిన్నప్పటి నుంచి నేను ఎవరిపై కూడా ఆధారపడి బ్రతకలేదు. నా స్వయం కృషితో ఎదిగిన మహిళను నేను.. నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి నాకు ఏ ఒక్క మగవాడి తోడు అవసరం లేదు. ఒకవేళ నేను ఎవరితోనైనా ఉండాలనుకుంటే మాత్రం అది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయమే.. కాబట్టే అది ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది మలైకా అరోరా. ఇక ప్రస్తుతం మలైకా అరోరా చేసిన ఈ కామెంట్ తో డేటింగ్ పుకార్లకు చెక్ పడిందనే చెప్పాలి. అంతేకాదు ఇలా డేటింగ్ రూమర్లతో నిత్యం తనను విమర్శిస్తున్న వారికి మలైకా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా ఈయనపై వస్తున్న డేటింగ్ రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×