E-Paper
Advertisement

Allu Arjun : మలయాళ నటుడు కోసం ఆ పని చేసిన హీరో.. అల్లు అర్జున్ గ్రేట్ అంతే..

Allu Arjun : మలయాళ నటుడు కోసం ఆ పని చేసిన హీరో.. అల్లు అర్జున్ గ్రేట్ అంతే..

Allu Arjun : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు నటించిన ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో ఆయన క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.. ఇదిలా ఉండగా… ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఒక రేంజ్ ఉంటుంది. అవును నిజమే.. కానీ అంత స్టార్ డం ఉన్న బన్నీ మాత్రం ఓ నటుడుకు సాయం చేసాడు. ఆ నటుడు ఇన్నాళ్లకు ఆ విషయాన్ని బయటపెట్టాడు. అసలు బన్నీ ఏం చేశాడు..? ఆ మూవీ వివరాలను కాస్త వివరంగా తెలుసుకుందాం..

అల్లు అర్జున్ పై మలయాళ నటుడు కామెంట్స్.. 

మలయాళం లో వరుస హిట్ సినిమాలలో నటించిన నటుడు జయరాం.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళం లోని సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వడంతో ఈయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. అల్లు అర్జున్, మలయాళ నటుడు జయరాం అలా వైకుంఠపురం సినిమాలో నటించారు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ సమయంలో అల్లు అర్జున్ చేసిన సాయం గురించి నటుడు తాజాగా బయటపెట్టాడు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అల్లు అర్జున్ గురించి సంచన విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. నాకు తెలుగు భాష రాదు. ఎన్నిసార్లు చదివినా డైలాగులు అస్సలు గుర్తుండేవి కావు. ఒక సీన్‌లో అల్లు అర్జున్ ఎదురుగా ఉండి నేను డైలాగ్ చెప్పాలి. కానీ ఎన్ని టేకులు తీసుకున్నా డైలాగ్ పూర్తి అవ్వలేదు. దాంతో నాకు ఒక ఆలోచన వచ్చింది. డైలాగ్ పేపర్ ను హీరో ముఖం పై పెట్టమని అడిగాను.. దానికి నవ్వుతూ ఒప్పుకున్నాడు బన్నీ.. అలా ఆ సీన్ కంప్లీట్ అయ్యింది. అల్లు అర్జున్ అలా ఒప్పుకోవడం గ్రేట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు..

Also Read : నాని ‘ది ప్యారడైజ్ ‘ కు ఎన్నో చిక్కులు.. మళ్ళీ వాయిదా పడినట్లే..?

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యి వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేసింది.. అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్గా ఈ చిత్రం నిలిచింది. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో 22 వ చిత్రంలో నటిస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ మొదలైంది.. ఈ మూవీ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×