E-Paper
Advertisement

Cheapest 7 Seater Car: అత్యంత చౌకైన 7-సీటర్ కారు, దీని ధర ఎంతో తెలుసా?

Cheapest 7 Seater Car: అత్యంత చౌకైన 7-సీటర్ కారు, దీని ధర ఎంతో తెలుసా?
Advertisement

India’s cheapest 7 seater Car: ఇండియాలో చాలా మంది ఫ్యామిలీ ప్రయాణాల కోసం 7 సీటర్ కార్లను ఎక్కువగా ఇష్టపడుతారు. ఎక్కువ స్థలం, మంచి సౌకర్యంతో పాటు తక్కువ ధరకు లభించే 7 సీటర్ కార్ల కోసం చాలా మంది చూస్తాడు. మల్టీ పర్పస్ వెహికిల్స్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. చాలా కంపెనీలు తక్కువ ధరలో ఏడుగురు ప్రయాణీకులు వెళ్లే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో అత్యంత సరసమైన 7 సీటర్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో అత్యంత సరసమైన 7 సీటర్ కారు

ప్రస్తుతం దేశంలో అత్యంత సరసమైన 7 సీటర్ కారుగా రెనాల్ట్ ట్రైబర్ గుర్తింపు తెచ్చుకుంది. దీని ధర సుమారు రూ. 5.76 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కొనుగోలుదారులకు మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. తక్కువ ధర ఉన్నప్పటికీ, మంచి ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్‌ను అందిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ ఇంజిన్, పనితీరు

Advertisement

ట్రైబర్‌ లోని పెట్రోల్ ఇంజిన్ దాదాపు 72 PS పవర్, 96 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కుటుంబ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. సిటీతో పాటు హైవే డ్రైవింగ్‌కు సరిపోతుంది. తేలికపాటి డిజైన్, ఎకానమీ ఆధారిత సెటప్ రన్నింగ్ ఖర్చులను తక్కువగా ఉంచడంలో సాయపడుతుంది. ఇది మాన్యువల్ పెట్రోల్ వేరియంట్‌ కు 20 కిమీ/లీ వరకు, ఆటోమేటిక్ (AMT) వేరియంట్‌కు 18.2 కిమీ/లీ వరకు మైలేజీ అందిస్తుంది.

ఇంటీరియర్, ఎక్స్‌ టీరియర్, ఫీచర్లు

ట్రైబర్ లోపల ఎక్కువ స్థలం ఉంది. ఇది రెండవ, మూడవ వరుసలతో సౌకర్యవంతమైన సీటింగ్ లే అవుట్‌ను అందిస్తుంది. ఇంటీరియర్ చాలా సింపుల్ గా కంఫర్ట్ గా ఉంటుంది. ఈ మోడల్ కు సంబంధించిన పలు వేరియంట్లలో 8 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, బ్లూటూత్, USB కనెక్టివిటీ, క్యాబిన్ అంతటా ఎయిర్ కండిషనింగ్ లాంటి ఆధునిక సౌకర్యాల ఉన్నాయి.

Advertisement

ఈ కారు కాంపాక్ట్ పరిమాణం ఉన్నప్పటికీ, ట్రైబర్ పొడవైన స్టాన్స్, వెడల్పు ఫ్రంట్ గ్రిల్, సొగసైన హెడ్‌ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఇవి బలమైన రోడ్ ప్రెజెన్స్‌ ను ఇస్తాయి. రూఫ్ రైల్స్, స్కల్ప్టెడ్ బాడీ లైన్లు, SUV లుక్ కు అనుకూలంగా ఉంటాయి.

Read Also: 50 వేల కార్ల అమ్మకం.. రూ.50 వేల తగ్గింపు.. స్కోడా గుడ్ న్యూస్!

రెనాల్ట్ ట్రైబర్ భద్రతా ఫీచర్లు

భద్రత పరంగా రెనాల్ట్ ట్రైబర్ మంచి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ముందు ప్రయాణీకులకు సీట్‌ బెల్ట్ రిమైండర్లు కూడా ఉన్నాయి. పార్కింగ్ సమయంలో సహాయం చేయడానికి రియర్ వ్యూ కెమెరాతో కూడిన హైయర్ వేరియంట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ కారు దేశంలో అత్యంత సరసమైన 7 సీటర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: యాక్టివా To సుజుకి.. జనవరిలో ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేసిన స్కూటర్స్ ఇవే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×