E-Paper
Advertisement

మానస శర్మ ఆ హీరోని ప్రేమించిందా.. అసలు స్టోరీ ఏంటంటే?

మానస శర్మ ఆ హీరోని ప్రేమించిందా.. అసలు స్టోరీ ఏంటంటే?
Advertisement

Manasa Sharma: ప్రముఖ లేడీ డైరెక్టర్ మానస శర్మ(Manasa Sharma) .. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. ఇటీవల దర్శకురాలిగా తొలిసారి వెండితెరకు పరిచయమవుతూ.. రాకాస సినిమాతో ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. తన దర్శకత్వపు మెలకువలతో.. అద్భుతమైన విజువలైజేషన్ తో సినిమాను తెరకెక్కించి.. అందరి దృష్టిని ఆకట్టుకుంది. సమ్మర్ స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకురాలిగా తొలి ప్రయత్నం లోనే మంచి సక్సెస్ అందుకున్న మానసకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

గోల్డ్ మెడలిస్ట్ నుండి ఫిలిం మేకర్ వరకు..

ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయిన మానస శర్మ ఐఏఎస్ కావడానికి దాదాపు ఆరు సంవత్సరాల పాటు కష్టపడింది. అయితే ఐఏఎస్ ప్రిపరేషన్ లో చరిత్ర గురించి చదివిన ప్రతిసారి ఆమెకు సినిమా గురించే ఆలోచన వచ్చేదట. ఇక దాంతో ఎలాగైనా తన ఆలోచనలకు రూపం దాల్చాలి అనుకున్న ఆమె నిహారిక ప్రొడక్షన్ కంపెనీలో ‘మ్యాడ్ హౌస్’ అనే యూట్యూబ్ సీరీస్ కి రైటర్గా పనిచేసింది. ఆ తర్వాత ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి క్రియేటర్ గా, రచయితగా మారి తనలోని క్రియేటివిటీని నిరూపించుకున్న మానస ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్ తో దర్శకురాలిగా మారి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రాకాస సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్న మానస శర్మ.. తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అయిందని చెప్పవచ్చు.అలా ప్రస్తుతం ఎక్కడ చూసినా మానస శర్మ పేరు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె గురించిన పాలు విషయాలు వైరల్ అవ్వగా.. అందులో ఒకటి ఆమె ప్రేమ విషయం. ఒక హీరోతో దాదాపు 6 సంవత్సరల పాటు ప్రేమాయణం కొనసాగించిందట. అయితే అది మధ్యలోనే బ్రేకప్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం ..

ప్రేమలో పడ్డ మానస శర్మ.. ఆరేళ్లకే బ్రేకప్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాకాస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంగీత్ శోభన్ తో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సినిమా (2021) సమయం నుంచే పరిచయం ఏర్పడిందని, తనతో ఉన్న ఆ పరిచయం మరింత పెరిగిందని, అందుకే సంగీత్ శోభన్ ను తాను కొడుకులా భావిస్తానని ఇటీవల సోషల్ మీడియా వేదికగా మానస శర్మ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో సంగీత్ శోభన్ అన్నయ్య ప్రముఖ హీరో సంతోష్ శోభన్ తో మానస ప్రేమలో ఉందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఆరు సంవత్సరాలుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కానీ ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి..

also read:ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాల్సిన మానస శర్మ ఫిలిం మేకర్ ఎలా అయిందంటే?

సోషల్ మీడియాలో ఆగని రూమర్స్..

Advertisement

అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ గతంలో ఈమె సంతోష్ శోభన్ తో ప్రేమలో ఉందని , అందుకే సంతోష్ తమ్ముడిని ఒక కొడుకులా భావిస్తున్నానని ఇటీవల చెప్పింది అంటూ కొంతమంది నెటిజన్లు రూమర్లు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా మానస శర్మకు సంబంధించిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరి నిజంగానే ఆమె సంతోష్ శోభన్ తో ప్రేమలో పడిందా ? లేక ఇదంతా కేవలం గాసిప్ మాత్రమేనా? అనే విషయం తెలియాలి అంటే కాలమే నిర్ణయించాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×