Hyderabad Biryani Scam: హైదరాబాద్ అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చే వాటిలో బిర్యానీ కూడా ఒకటి. నగరవాసులు ఎంతో ఇష్టంగా బిర్యానీని తింటూ ఉంటారు. వారంలో కనీసం ఒకట్రెండు సార్లైన ఆన్ లైన్ లో బిర్యానీ ఆర్డర్ చేసుకొని కుటుంబమంతా హాయిగా భుజిస్తుంటారు. అలా ఇష్టంగా బిర్యానీ తింటున్న వారికి భారీ షాకిచ్చే ఘటన తాజాగా నగరంలో చోటుచేసుకుంది. 3 రోజుల క్రితం వండిన బిర్యానీని డెలివరీ చేస్తున్న ఓ హోటల్ యజమాని గుట్టును బంజరాహిల్స్ పోలీసులు రట్టు చేశారు.
బంజారాహిల్స్ లోని రోడ్ నెం-2లో నివసిస్తున్న కొండారెడ్డి అనే వ్యక్తికి తొలుత ఈ ఛేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఉన్న లక్కీ షవర్మా రెస్టారెంట్ నుంచి అతడు చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో జొమాటో డెలివరీ బాయ్ దానిని తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో కొండారెడ్డి ప్యాకెట్ ఓపెన్ చేయగా.. ఘుమఘుమలకు బదులుగా దుర్వాసన వచ్చింది. లోపల బిర్యానీ పాచిపోయి ఉండటం చూసి అతడు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
పాచిపోయిన బిర్యానీని సరఫరా చేసిన లక్కీ షవర్మా రెస్టారెంట్ పై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో కొండారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఫ్రిడ్జ్ లో ఉన్న 80 బిర్యానీ ప్యాకెట్లు చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. జీడిమెట్లలో తయారు చేసిన బిర్యానీని ఇక్కడికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్డర్ వచ్చిన వెంటనే బిర్యానీని ఓవెన్ లో వేడి చేసి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. పైగా అవన్నీ 3 రోజుల క్రితం తయారైనట్లు కూడా పోలీసులు గుర్తించారు.
Also Read: 4 రాష్ట్రాలు. 365 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు.. విద్యార్థుల పాలిట వరంలా మంచు లక్ష్మీ !
హోటల్ యజమాని ఇర్ఫాన్.. ఈ పాచిపోయిన బిర్యానీని అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాస్తవానికి బంజారాహిల్స్ లో అతడికి ఎలాంటి రెస్టారెంట్ లేదని.. ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లో లక్కీ బిర్యానీ అండ్ షవర్మా పేరిట మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జీడిమెట్లలో తనకు ఉన్న మరో రెస్టారెంట్ లో బిర్యానీ తయారు చేసి.. ఇక్కడి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు కూడా తేలింది. అంతేకాకుండా హోటల్ మెుత్తం ఎలుకలు, బొద్దింకలతో అపరిశుభ్రంగా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడ్ని అరెస్టు చేసి.. హోటల్ ను సీజ్ చేశారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు సైతం అతడిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.
Also Read: ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హాట్ కామెంట్స్.. కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది? వ్యాఖ్యల వెనుక