E-Paper
Advertisement

March Releases: బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల విడుదలైన సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..!

March Releases: బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ నెల విడుదలైన సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..!
Advertisement

March Releases: ఇప్పటి సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా హిట్ అయ్యిందంటే నెలల తరబడి థియేటర్లలో ఆడటం సాధారణం. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అలవాట్లు మారాయి, ఆన్‌లైన్ కంటెంట్ పెరిగింది, సినిమాలకు ఇచ్చే సమయం తగ్గింది. దీంతో చాలా సినిమాల జీవిత కాలం చాలా చిన్నదిగా మారింది. రిలీజ్ అయిన మొదటి కొన్ని రోజుల్లోనే సినిమా భవితవ్యం తేలిపోతోంది. ముఖ్యంగా వీకెండ్ అయిపోయిన వెంటనే సినిమాల పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు అసలు అసెస్‌మెంట్‌గా మారింది. అదే నేపథ్యంలో, వీకెండ్ తర్వాత సినిమాలు ఎలా నిలబడుతున్నాయి, ప్రేక్షకుల స్పందన ఎలా మారుతోంది అనే విషయాలు గమనించడం చాలా ఆసక్తికరంగా మారింది.

ఈనెల విడుదలైన సినిమాల పరిస్థితి ఏమిటి..?

ఈ క్రమంలో ఈ నెల విడుదలైన సినిమాలు ఏమిటి? అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా కొనసాగుతున్నాయి అనే విషయానికి వెళితే.. ఒకటి ముందువారంలో రిలీజైన కపుల్ ఫ్రెండ్లీ. మరొకటి గత వారం వచ్చిన ఫంకీ. ఈ వారం కొత్తగా వచ్చినవి హే బలవంతం.. నవాబ్ కేఫ్.

Advertisement

ముందుగా “కపుల్ ఫ్రెండ్లీ” విషయానికి వస్తే, ఫస్ట్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్‌లో సినిమా స్లో అయింది. కానీ రెండో వీకెండ్‌కు వచ్చేసరికి కొంచెం పేస్ పెరిగింది. ఒక ప్రభాస్ ఇంటర్వ్యూ వల్ల సినిమాకు కొంత విజిబిలిటీ వచ్చింది. టాక్ డీసెంట్‌గా ఉండటంతో రెండో వీకెండ్‌లో కొన్ని ఏరియాల్లో ఫస్ట్ వీకెండ్ కంటే కూడా మంచి నెంబర్లు వచ్చాయి. అయితే సినిమా ఎక్కువగా అర్బన్, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కే పరిమితమవడం వల్ల ఇంకా బెటర్‌గా చేయాల్సిన అవకాశం ఉండేది. అయినా మొత్తంగా రెండో వీకెండ్ బాగానే నిలబడింది.

తర్వాత ఫంకీ విషయానికి వస్తే, ఇది ఫస్ట్ వీకెండ్ నుంచే స్లోగా సాగింది. వర్కింగ్ డేస్‌లో పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడు రెండో వారం వచ్చేసరికి ఎక్కడా ట్రేస్ కూడా కనిపించకుండా పోయింది.

Advertisement

కొత్త రిలీజ్‌లలో “నవాబ్ కేఫ్” పరిస్థితి మరీ దారుణం. ఓపెనింగ్ లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇది మరో డిసపాయింట్‌మెంట్‌గా మారింది. ఇక “హే బలవంతం” విషయానికి వస్తే, మంచి ప్రమోషన్ జరిగింది. సినిమాకు కొంత విజిబిలిటీ వచ్చింది. ఓపెనింగ్ కూడా ఈ మధ్యకాల సినిమాలతో పోలిస్తే డీసెంట్‌గా ఉంది. కానీ సినిమాలో ఉన్న లోపాల వల్ల మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎక్కువగా నెగటివ్ వైపే టాక్ వెళ్లింది. ఫస్ట్ వీకెండ్‌లో స్లో స్టార్ట్ కనిపించింది. వర్కింగ్ డేస్‌లో హోల్డ్ చేసి, రెండో వీకెండ్ వరకు నిలబడాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

మార్చి నెల సినిమాల రిజల్ట్ ఇదే..!

మొత్తం పైన ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ నెల విడుదలైన సినిమాల ఫలితం అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. అయినా ఓటీటీ డీల్ బెటర్‌గా ఉండటంతో.. వీటిల్లో చాలా సినిమాలకు రిస్క్.. తగింది. చివరికి ఫైనల్ రన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ALSO READ: Harish Shankar: ‘ఉస్తాద్’లో ఎలివేషన్స్ ఉంటాయ్.. ఎటకారపు ధోరణి ఉండదు

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×