E-Paper
Advertisement

Netizens on TTD: సెలబ్రిటీల సంగతి సరే.. సామాన్యుల సంగతి ఏమిటీ? టీటీడీని ప్రశ్నిస్తున్న నెటిజన్స్, ఎందుకంటే?

Netizens on TTD: సెలబ్రిటీల సంగతి సరే.. సామాన్యుల సంగతి ఏమిటీ? టీటీడీని ప్రశ్నిస్తున్న నెటిజన్స్, ఎందుకంటే?
Advertisement

Netizens on TTD: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతి రోజు కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక తిరుమలలో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న సంగతి తెలిసిందే .ఇలా సెలబ్రిటీలకు విఐపి దర్శనం నిమిత్తం సామాన్య భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్న నేపథ్యంలో సామాన్య భక్తులు పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే తాజాగా నటి మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary)కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అదేవిధంగా తిరుమలలో కల్పిస్తున్న సౌకర్యాలు గురించి కూడా మీనాక్షి చౌదరి తెలియచేశారు.

విఐపీ బ్రేక్ తో సామాన్యులకు ఇబ్బందులు..

ఇలా మీనాక్షి చౌదరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ టీటీడీ పై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా టీటీడీ తీరును ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు లేదా సినిమా సెలబ్రిటీలు వస్తే విఐపి బ్రేక్ అంటూ సామాన్య భక్తులకు దర్శనాలను నిలిపివేస్తారు. ఈ తరుణంలోనే సామాన్య భక్తులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. సెలబ్రిటీలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండడంతో తిరుమల పట్ల వారికి మంచి అభిప్రాయం ఉంటుందని, ఇదే సౌకర్యాలు సాధారణ భక్తుల విషయంలో కూడా కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

?igsh=MWd4ZmJ4MHhhcHBoMg%3D%3D

తాజాగా మీనాక్షి చౌదరి తిరుమలలో కల్పించే సౌకర్యాలు గురించి అలాగే అన్న ప్రసాదం గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ తిరుమల గొప్పతనాన్ని తెలియజేశారు. లిటిల్ హార్ట్ హీరోయిన్ శివాని నాగారం సైతం తనకు తిరుమలలో మొదటిసారి 15 నిమిషాల పాటు దర్శనం కల్పించారంటూ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లతో తిరుమల గొప్పతనం గురించి ప్రమోషన్ చేయించడం, స్వామి వారి గొప్పతనాన్ని చాటి చెప్పడం తప్పు కాదు కానీ సెలబ్రిటీల తరహాలోనే సామాన్య భక్తుల సౌకర్యాలు గురించి కూడా కాస్త ఆలోచించి సామాన్య భక్తులకు కూడా దర్శనం త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటూ భక్తులు, నెటిజన్లు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇక ఇటీవల మీనాక్షి చౌదరి కాలినడకన తిరుమల ఆలయానికి వెళ్లి అక్కడ స్వామి వారిని దర్శనం చేసుకున్న విషయం విధితమే.

Advertisement

Also Read: Anupama Parameswaran: కార్తికేయ 2 తరువాత దానికి దూరంగా అనుపమ…మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ పని చేసిందా?

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×