E-Paper
Advertisement

Mana Shankaravara Prasad Garu Movie: మెగా-విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసిందోచ్

Mana Shankaravara Prasad Garu Movie:  మెగా-విక్టరీ మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసిందోచ్
Advertisement

Mana Shankaravara Prasad Garu Movie: సంక్రాంతి రేసులోకి మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారంటేనే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైనట్లే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంపై అంచనాలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ ‘మెగా-విక్టరీ మాస్ సాంగ్’ అప్‌డేట్‌ను పంచుకుంది.

ఒకే ఫ్రేమ్‌లో చిరు – వెంకీ
ఈ సినిమాలోనే బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ ఈ మాస్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోతున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి ఒకే పాటలో సందడి చేయబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రేపు (శుక్రవారం) ఈ ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి తోడుగా, భీమ్స్ సెసిరోలియో మాస్ బీట్స్ ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం.

Advertisement

ఎన్.ఐ.ఏ ఆఫీసర్‌గా మెగాస్టార్
ఈ చిత్రంలో చిరంజీవి పవర్‌ఫుల్ NIA ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తూ సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు రాబోయే మాస్ సాంగ్ సినిమా హైప్‌ను అమాంతం పెంచేయనుంది.

సంక్రాంతి బరిలో రికార్డుల వేట
నయనతార హీరోయిన్‌గా, కేథరిన్ థ్రెసా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఇచ్చే మాస్ ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Advertisement

 

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×