E-Paper
Advertisement

నేను బ్రతికే ఉన్నాను.. ప్లీజ్ చంపేయొద్దు.. సోషల్ మీడియా పై ఫైర్ అయిన శక్తి కపూర్!

నేను బ్రతికే ఉన్నాను.. ప్లీజ్ చంపేయొద్దు.. సోషల్ మీడియా పై ఫైర్ అయిన శక్తి కపూర్!
Advertisement

Shakti Kapoor: ఇటీవల కాలంలో సోషల్ మీడియా మంచిగా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి .ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలు నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలలో ఏది నిజం ఏది అబద్దం అనేది మాత్రం తెలియకుండానే వార్తలను వైరల్ చేస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కొద్ది రోజులపాటు మీడియా కంటికి కనిపించకపోతే వాళ్లను చంపేస్తున్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము. ఇక సెలబ్రిటీ భార్యాభర్తలు కలిసి కనిపించకపోతే విడాకులు ఇచ్చేస్తున్నారు.

శక్తి కపూర్ మరణ వార్త..

ఈ విధంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి నిత్యం ఎన్నో రకాల ఫేక్ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శక్తి కపూర్ గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శక్తి కపూర్ బాలీవుడ్ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు అయితే ఈయన మరణించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా శక్తి కపూర్ మరణించారనే విషయం తెలిసినటువంటి కొంతమంది ఈయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు.

నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను..

Advertisement

ఈ విధంగా శక్తి కపూర్ మరణం గురించి సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయన తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో శక్తి కపూర్ మాట్లాడుతూ నేను చాలా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను. నేను చనిపోయాను అంటూ వస్తున్నటువంటి వార్తలు అన్ని పూర్తిగా ఆవాస్తవమని దయచేసి ఎవరూ కూడా ఇలాంటి వార్తలను నమ్మొద్దు అంటూ శక్తి కపూర్ క్లారిటీ ఇచ్చారు. ఇలా తాను బ్రతికే ఉన్నానని చెబుతూనే మరోవైపు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారికి తనదైన స్టైల్ లోనే వార్నింగ్ కూడా ఇచ్చారు.

?igsh=MWlqaG94Z2IxYTRyZg%3D%3D

Advertisement

సెలబ్రిటీల ప్రాణాలతో చెలగాటమాడుతూ అందరిని ఆందోళన కలిగించే ఇలాంటి డెత్ హోక్స్ క్రియేటర్ల పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా ఈయన తెలిపారు.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సుమారు 700కు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న శక్తి కపూర్ మరణ వార్త ఒక్కసారిగా అభిమానులను కలిచి వేసింది. కానీ ఈయనకు ఏం కాలేదని ఈయన క్షేమంగా ఉన్నారని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక నటుడు శక్తి కపూర్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఆయన కూతురు శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ నటించిన విషయం తెలిసిందే.

Alsop Read: నయనతార నటన పై కరీనా కపూర్ కామెంట్స్…ఇలా అనేసిందేంటీ?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×