E-Paper
Advertisement

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్
Advertisement

Mirzapur Box Office:‘మీర్జాపూర్’….’మీర్జాపూర్’….’మీర్జాపూర్’….ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది .వెబ్ సిరీస్ గా వచ్చి సత్తా చాటిన ‘మీర్జాపూర్’ ఇపుడు సినిమాగా థియేటర్ లోకి వచ్చిన సంగతి తెల్సిందే…

సెప్టెంబర్ 4న తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలోకి వచ్చిన ‘మీర్జాపూర్’ సినిమాకు మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రెస్పాన్స్ కనిపిస్తోంది.ఇక కాలీన్ భయ్యా , గుడ్డు భయ్యా మున్నా భయ్యా లు అయితే ఆడియన్స్ ని తమ పాత్రలతో ఫిదా చేసేశారు.

Advertisement

స్టార్ హీరో సినిమా రేంజ్‌లో తొలిరోజే వసూళ్లు

సాధారణంగా వెబ్ సిరీస్ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు థియేటర్లలో ఓపెనింగ్స్ రావడం కాస్త కష్టమే. కానీ మీర్జాపూర్ విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఓ పెద్ద స్టార్ హీరో సినిమా రేంజ్‌లో తొలిరోజే వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకె పెద్ద షాక్ ఇచ్చింది.

Advertisement

అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యెందు శర్మ, రాశిక దుగ్గల్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించగా, గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఈ చిత్రాన్ని  నిర్మించాయి.

దాదాపు రూ.80 కోట్ల వరకు

ఇక ఈ సినిమా బడ్జెట్, ప్రమోషన్స్ అన్ని కలిపి దాదాపు రూ.80 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తుంది . థియేట్రికల్ బిజినెస్ రూపంలో రూ.60 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే దాదాపు రూ.130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉందని సమాచారంఅయితే .మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ఈ బిగ్ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కూడా.

ఇక మొదటి రోజు నేషనల్ వైడ గా ఈ సినిమా దాదాపు రూ.26 కోట్ల నెట్ (రూ.31 కోట్లకు పైగా గ్రాస్) వసూలు చేసి సత్తాచాటింది . ఇక ప్యాన్ ఇండియా వైడ్ గా 11 వేలకు పైగా షోలు ప్రదర్శించగా, ఓవరాల్‌గా 40 శాతానికి పైగా థియేటర్స్ ఫుల్ అయినట్టు సమాచారం.

విదేశాల్లోనూ రూ.34 కోట్ల గ్రాస్

.ముఖ్యంగా ఢిల్లీ ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి ప్రాంతాల్లో జనాలు థియేటర్లకు పోటెత్తారంటే నార్త్ ఆడియన్స్ ని సినిమా ఎంతలా అలరించిందో అర్థం అవుతుంది .ఇక విదేశాల్లోనూ రూ.34 కోట్ల గ్రాస్ రాబట్టడంతో, వరల్డ్ వైడ్‌గా తొలిరోజు కలెక్షన్ రూ.35 కోట్లు దాటింది.

ఇక రెండో రోజు శనివారం కావడంతో బుకింగ్స్ మరింత జోరందుకున్నాయి. బుక్ మై షోలో 9.1/10 రేటింగ్ రావడంతో టాక్ పాజిటివ్‌గా మారిందని తెలుస్తుంది. రెండో రోజు మధ్యాహ్నానికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయట కూడా .

రెండో రోజు రూ.21 కోట్ల నెట్ కలెక్షన్

శనివారం నైట్ షోలు కూడా కలిపితే ఇండియాలో రెండో రోజు రూ.21 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ తో కలిపితే కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకి పైగానే గ్రాస్ మార్క్‌ను టచ్ చేసేలా కనిపిస్తోంది.

అయితే కేవలం ఒక రాత్రి క్రేజ్‌తో ఆగిపోకుండా , రెండో రోజు కూడా థియేటర్లలో అదే హవా కొనసాగించడం మీర్జాపూర్ సక్సెస్ అనే చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సిరీస్‌ను ఇష్టపడే యూత్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇదే ఊపు ఆదివారం కూడా కొనసాగితే, వీకెండ్ ముగిసేసరికి సినిమా సగం టార్గెట్‌ను దాటేసే అవకాశాలు పుష్కలం..

Also read :గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

Tags

Related News

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

Big Stories

Advertisement
×