E-Paper
Advertisement

హీరో, అతడి భార్య వల్లే నా కెరియర్ నాశనమవుతోంది..యువనటి ఎమోషనల్ వీడియో వైరల్!

హీరో, అతడి భార్య వల్లే నా కెరియర్ నాశనమవుతోంది..యువనటి ఎమోషనల్ వీడియో వైరల్!
Advertisement

Film industry: ఒకప్పుడు సినిమాలలో అవకాశం లభించాలి అంటే కొత్తవారు ఏ రేంజ్ లో కష్టపడేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అవమానాలు, హేళనలు, ఇబ్బందులు.. ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత నటులుగా అవకాశం అందుకొని.. ఆ తర్వాత తమ కష్టార్జితంతో ఉన్నత స్థానాలకు చేరుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు సినిమాలకంటే ఓటీటీ హవా ఎక్కువగా పెరిగిపోయింది. అందుకే ఇక్కడ వెబ్ సిరీస్ లలో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ బుల్లితెర ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఒక వెబ్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న ఒక నటి.. అవకాశం లభించింది అని సంతోషపడేలోపే తనను ఆ వెబ్ సిరీస్ హీరో, అలాగే అతడి భార్య ఇబ్బందులు పెడుతున్నారని, అగ్రిమెంట్ తీసుకొని ఇంకో సినిమాలో నటించకుండా టార్చర్ చేస్తున్నారని, తిండి కూడా సరిగ్గా పెట్టట్లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఒక వీడియో పంచుకుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

షూటింగ్ పేరిట ఆర్థికంగా దెబ్బ కొట్టారు..

ఆమె ఎవరో కాదు యంగ్ మలయాళ నటి అనుగ్రహ ఎస్ నంబియార్. కేరళకు చెందిన 23 ఏళ్ల యువ నటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది. అడిపోలి అనే చిత్రం చేసిన ఈమె ప్రస్తుతం హాట్ స్టార్ లో ప్రతివారం ప్రసారమవుతున్న రిసార్ట్ అనే వెబ్ సిరీస్ లో శ్రీనిధి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని చెబుతూ ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని అనుగ్రహ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఆమె మాట్లాడుతూ..” ఈ సిరీస్ కోసం నేను అగ్రిమెంట్ పై సంతకం చేసినప్పటికీ నా పాత్రకు సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టలేదు. మరే సినిమాల్లో నటించొద్దని నాతో సంతకం తీసుకున్నారు. గత నాలుగు నెలలుగా పని లేకపోయేసరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నిర్మాణ సంస్థను సంప్రదిస్తే సరైన సమాధానం లేదు.

హీరో, ఆయన భార్య టార్చర్ చేస్తున్నారు..

Advertisement

నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. నా కలలు అడ్డుకోవడానికి మీకు ఎవరికీ హక్కు లేదు. ముఖ్యంగా సరైన భోజనం పెట్టడం లేదు. షూటింగ్ టైంలో సరైన సౌకర్యాలు లేవు. పారితోషకం అడిగితే బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల నా ఆరోగ్యం దెబ్బతినింది. ఆసుపత్రిలో కూడా చేరాను. నా పరిస్థితి విషమించి ఉంటే చనిపోయేదాన్ని. ఇక హాస్పిటల్లో చేరానని విజయ్ తో చెబితే నిర్లక్ష్యంగా స్పందించాడు. ఆయన భార్య నక్షత్ర కూడా నాతో అనుచితంగా మాట్లాడింది.

ALSO READ:అషురెడ్డి వివాదం.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన తండ్రి!

స్పందించకపోతే లీగల్ చర్యలు తప్పవు..

Advertisement

ఈ వ్యవహారంపై నిర్మాతలు సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. దయచేసి ఇలాంటి పరిస్థితులను ఇంకెవరికి కల్పించకండి” అంటూ అనుగ్రహ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ యువ నటికీ ఇంత అన్యాయం జరుగుతోందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మరి దీనిపై సిరీస్ బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×