E-Paper
Advertisement

అమ్మో ఇండియన్ రైల్వే.. అన్ని లక్షల మంది పని చేస్తున్నారా?

అమ్మో ఇండియన్ రైల్వే.. అన్ని లక్షల మంది పని చేస్తున్నారా?
Advertisement

Largest Employers in the World Indian Railways: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఉద్యోగ అవకాశాల్లో ఈ సంస్థ ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతీయ రైల్వేలో దేశ వ్యాప్తంగా సుమారు 14 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సంఖ్యను చూస్తే..  మన రైల్వే సంస్థ ఎంత పెద్దదో అర్థం అవుతుంది.

కేవలం రైళ్లు నడిపే వ్యవస్థ మాత్రమే కాదు!

భారతీయ రైల్వే కేవలం రైళ్లు నడిపే వ్యవస్థ మాత్రమే కాదు. బోలెడు విభాగాలతో కూడిన ఒక పెద్ద నెట్‌ వర్క్. ట్రాక్‌ల నిర్మాణం, నిర్వహణ, రైళ్ల ఆపరేషన్, సిగ్నలింగ్, టెక్నికల్ సపోర్ట్, టికెట్ బుకింగ్, భద్రత, క్యాటరింగ్, క్లీనింగ్ లాంటి అనేక పనులను నిర్వహించడానికి విభిన్న రకాల ఉద్యోగులు ఉంటారు. అందుకే, ఈ సంస్థలో ఇంజినీర్లు, టెక్నీషియన్లు, గార్డులు, డ్రైవర్లు, క్లర్కులు, పోలీస్ సిబ్బంది, మేనేజ్‌మెంట్ స్టాఫ్ ఇలా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పని చేస్తున్నారు.

నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు!

Advertisement

ఈ ఉద్యోగాలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కావు. గ్రామీణ ప్రాంతాల నుండి కూడా వేలాది మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. రైల్వే స్టేషన్లు, వర్క్‌ షాప్‌లు, ట్రాక్ మెయింటెనెన్స్ యూనిట్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటంతో, ప్రతి ప్రాంతంలోనూ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది.

రైల్వే ఉద్యోగాల పట్ల యువతో ఆసక్తి

భారతీయ రైల్వేలో ఉద్యోగం అంటే చాలా మందికి స్థిరమైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థ కావడంతో జీతభత్యాలు, పెన్షన్, మెడికల్ సదుపాయాలు లాంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువకులు రైల్వే ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే పరీక్షలు దేశంలోనే అత్యధికంగా అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలలో ఒకటిగా నిలుస్తాయి.

Advertisement

అంతేకాకుండా, ఈ సంస్థ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా పెద్ద తోడ్పాటు అందిస్తోంది. రైల్వే ఉద్యోగుల ద్వారా అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. పరోక్షంగా కూడా చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది. రైల్వే స్టేషన్లలో ఉన్న చిన్న వ్యాపారాలు, సరుకు రవాణా సేవలు, ఫుడ్ సప్లై చైన్ లాంటివి కూడా రైల్వే వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి.

పెద్ద సవాల్ అయినప్పటికీ..

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నిర్వహించడం కూడా ఒక పెద్ద సవాల్. అందుకే భారతీయ రైల్వే నిరంతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, పనితీరును మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. డిజిటలైజేషన్, ఆటోమేషన్ లాంటి మార్పులు వచ్చినప్పటికీ, హ్యూమన్ రిసోర్స్ అవసరం ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. అందుకే, భారతీయ రైల్వే కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.కోట్లాది ప్రజలకు జీవనాధారంగా నిలిచే ఒక మహా సంస్థ. లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తూ, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

Read Also: 5 గంటల్లో జమ్మూ-శ్రీనగర్ ప్రయాణం, డైరెక్ట్ వందే భారత్ వచ్చేస్తోంది!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×