E-Paper
Advertisement

Tollywood: సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Tollywood: సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
Advertisement

Tollywood:ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు కొంతమంది సెలబ్రిటీలు సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియా అంశాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా మరి కొంతమంది అటు రాజకీయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో సోషల్ మీడియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఇండియన్ సెలబ్రిటీల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎప్పటిలాగే మరోసారి ఆ హీరోయిన్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది.

సినిమాలతోనే కాదు వ్యక్తిగత జీవితంతో కూడా..

ఒకవైపు గత మూడు సంవత్సరాలలోనే బాక్సాఫీస్ వద్ద 3వేల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించిన బ్యూటీ రష్మిక మందన్న( Rashmika mandanna).పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, సికందర్, కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో భారీ పాపులారిటీ అందుకొని స్టార్ హీరోలు కూడా సాధించలేని రికార్డును సొంతం చేసుకుంది రష్మిక మందన్న. అయితే ఈమె ఇటు వ్యక్తిగతంగా కూడా వార్తల్లో నిలిచింది. ఎనిమిదేళ్లపాటు రహస్యంగా తమ ప్రేమను దాచుకొని.. ఎట్టకేలకు బహిర్గతం చేసి విజయ్ దేవరకొండ తో ఏడడుగులు వేసింది.అలా ఈ ఏడాది ప్రత్యేకించి ఫిబ్రవరి నెలలో అత్యధికంగా సర్చ్ చేయబడిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో చేరి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

ALSO READ:Bigg Boss Rohini: బిగ్ బాస్ రోహిణిపై వ్యక్తిగత విమర్శలు.. దెబ్బకు శాపనార్థాలు పెట్టిన నటి!

పెళ్లితో సంచలనం సృష్టించిన రౌడీ హీరో..

ఇకపోతే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత ప్రేమలో పడిన విజయ్ – రష్మిక ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఇక తర్వాత తన భార్యతో కలిసి సొంతూరికి వెళ్ళిన ఆయన గృహప్రవేశం చేసి తన ఊరి ప్రజలకు ఊరి అభివృద్ధిలో పాటుపడతానని భరోసా కల్పించారు. అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రకటించారు. అలా అందరినీ ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ఇండియన్ సెలబ్రిటీలలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తిగా రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.

Advertisement

మిగిలిన స్థానాలలో స్టార్ సెలబ్రిటీలు..

ఇకపోతే మిగిలిన స్థానాలలో నిలిచిన వారెవరు అనే విషయానికి వస్తే.. క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మూడవ స్థానాన్ని దక్కించుకోగా.. అటు రాజకీయాలతో ఇటు వ్యక్తిగతంగా వార్తల్లో నిలిచి నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి. అటు బాఫ్టా వేడుకల్లో సందడి చేసిన ఆలియా భట్ ఐదవ స్థానాన్ని దక్కించుకోగా.. ఇప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న ప్రభాస్ ఆరవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఏడవ స్థానంలో సల్మాన్ ఖాన్, 8వ స్థానంలో ఎంఎస్ ధోని , తొమ్మిదవ స్థానంలో షారుక్ ఖాన్, పదవ స్థానంలో ఫర్హానా బట్ నిలిచారు. అలా ఫిబ్రవరి నెల కు సంబంధించి మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ పర్సనాలిటీస్ జాబితాలో ఈ పదిమంది చోటు దక్కించుకోవడం గమనార్హం.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×