Galaxy M17e 5G| భారతదేశంలో శాంసంగ్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. బడ్జెట్ రేంజ్‌లో వచ్చన ఈ ఫోన్ పేరు శాంసంగ్ గెలాక్సీ M17e 5G. బలమైన బ్యాటరీ, 5G సపోర్ట్ కావాలనుకునే వాళ్ల కోసం ఈ ఫోన్ తయారు చేశారు. పెద్ద డిస్‌ప్లే, స్మూత్‌గా పనిచేసే డిస్‌ప్లే కూడా ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12,999. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.14,499. ఫోన్ రంగులు వైబ్ వయోలెట్, బ్లిట్జ్ బ్లూ. అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొన్ని రిటైల్ దుకాణాల్లో కూడా లభిస్తుంది. లాంచ్ రోజు ఉచిత ఆఫర్ ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.1,250 వరకు తగ్గింపు ఉంటుంది.
ఫోన్‌లో పెద్ద 6.7 ఇంచ్ HD+ డిస్‌ప్లే ఉంది. ఇది ఇన్ఫినిటీ-U LCD ప్యానెల్. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా స్మూత్‌గా ఉంటాయి. రిజల్యూషన్ 720 × 1600 పిక్సెల్స్. శాంసంగ్ కీ ఐలాండ్ డిజైన్ ఉంది. బ్యాక్ ప్యానెల్ గ్లాస్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ పాలిమర్ మెటీరియల్‌తో ఉంది. ఫోన్ మందం కేవలం 8.2mm మాత్రమే.
ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. శాంసంగ్ One UI 8 ఇంటర్‌ఫేస్ ఉపయోగిస్తుంది. ఈ మోడల్‌కు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఇస్తారు. ఆరు సంవత్సరాల OS అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటాయి. జెమిని లైవ్ ఫీచర్లు కూడా సపోర్ట్ చేస్తుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ సులభంగా చేస్తుంది. Mali-G57 MC2 GPU గ్రాఫిక్స్ కోసం ఉంది. 4GB లేదా 6GB ర్యామ్ ఆప్షన్లు ఉన్నాయి. రెండు వేరియంట్లలోనూ 128GB స్టోరేజ్ ఉంది. మైక్రోSD కార్డ్‌తో 2TB వరకు విస్తరించవచ్చు.
గెలాక్సీ M17e వెనకభాగంలో డ్యూయల్ కెమెరా ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. పోర్ట్రెయిట్ ఫోటోలు బాగా వస్తాయి. ముందు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సాధారణ ఫోటోలకు సరిపోతుంది.
6000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించవచ్చు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా ఛార్జ్ అవుతుంది.
12 బ్యాండ్లతో 5G సపోర్ట్ ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బ్లూటూత్ 5.3, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB Type-C పోర్ట్ ఉన్నాయి. IP54 రేటింగ్‌తో దుమ్ము, నీటి చినుకులతో కొంత రక్షణ ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M17e 5G బడ్జెట్ సెగ్మెంట్‌లో చాలా మంచి వ్యాల్యూ ఇస్తుంది. పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో నమ్మకమైన ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్.
Also Read: ఇండక్షన్ స్టవ్ కొనేముందు ఇవి చెక్ చేసుకోండి.. లేకపోతే కరెంట్ బిల్లు వాచిపోద్ది
ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న గెలాక్సీ బడ్జెట్ ఫోన్ ఫీచర్లు, ధరలు.. శాంసంగ్ కంపెనీ ప్రకటించే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వినియోగదారులు జాగ్రత్తగా చెక్ చేసి కొనుగోలు కొనాలని సూచన. కథనంలో తెలిపిన ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు.