E-Paper
Advertisement

Mrunal Thakur: వాలెంటైన్స్ డే కాదు ఫూల్స్ డే.. రూమర్స్ పై మండిపడ్డ మృణాల్!

Mrunal Thakur: వాలెంటైన్స్ డే కాదు ఫూల్స్ డే.. రూమర్స్ పై మండిపడ్డ మృణాల్!
Advertisement

Mrunal Thakur: సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఒకటికి రెండుసార్లు జంటగా కనిపించారంటే చాలు.. వారి మధ్య ఏదో ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ కాస్త చనువుగా కనిపిస్తే.. నిజంగానే వారి మధ్య ఎఫైర్ కొనసాగుతోంది అనే రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు. పైగా ఎప్పటికప్పుడు సెలబ్రిటీలు ఆ రూమర్స్ ని కొట్టి పారేసినా.. మరికొంతమంది వాటిని పట్టించుకోకుండా వదిలేసినా..ఆ రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూమర్స్ ని కొట్టిపారేసింది ప్రముఖ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).

వాలెంటైన్స్ డే కాదు ఫూల్స్ డే..

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న వార్త ఇదే.. ఈమె కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush )ఏడడుగులు వేయబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఒక ఫంక్షన్ లో వీరిద్దరూ చాలా సన్నిహితంగా కనిపించడంతోనే ఈ ఊహాగానాలు మరింత వేగంగా విస్తరించాయి. అయితే కొంతమంది ఇంకాస్త ముందుకు అడుగు వేసి.. ఫిబ్రవరి 14వ తేదీన వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ కథనాలు ప్రచారం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన ఈమె మళ్లీ స్పందిస్తూ మండిపడింది. “ఫిబ్రవరి 14 కాస్త ఏప్రిల్ ఒకటిగా మారినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ ఒకటి ఫూల్స్ డే కదా.. ఇదంతా ఎవరు మొదలు పెడుతున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా నేను ఈ డేట్ ను అధికారికంగా చెప్పినట్లు కొంతమంది ఇలాంటి గాసిప్స్ కూడా వ్యాపింప చేస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఇది వాలెంటైన్స్ డే కాదు ఫుల్ డే లాగా అనిపిస్తుంది అంటూ మృణల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:Funky: డైలాగ్స్ కాదు.. హీరోయిన్‌దే అసలైన మ్యాజిక్ – నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

రూమర్స్ కి చెక్ పెట్టిన మృణాల్..

నిజానికి గతంలోనే ఈ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది మృణాల్ ఠాగూర్. అయినా సరే ఆమె చేసిన కామెంట్లు మరింత ఆజ్యం పోసినట్టే అనిపించాయి. అయితే ఈసారి మాత్రం పక్కా క్లారిటీతో తనకు ధనుష్ తో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది. మరి ఇప్పటికైనా ఈ గాసిప్స్ కి ముగింపు లభిస్తుందో లేదో చూడాలి..

అయినా ఆగని రూమర్స్..

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో ఈమె ప్రేమలో ఉంది అంటూ వార్తలు వెలువడుతున్నాయి. అయితే వారిద్దరూ ఒక హిందీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సన్నిహితంగా కనిపిస్తూ తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం కావాలనే ఈమెపై ఇలాంటి తప్పుడు కథనాలు అల్లుతున్నారని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మృణాల్ ఠాకూర్ ఒకవైపు తక్కువ సినిమాలలో నటిస్తున్నా.. ఇలాంటి ఎఫైర్ రూమర్స్ కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంటుందని చెప్పవచ్చు. ఇక తెలుగులో డెకాయిట్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×