E-Paper
Advertisement

Funky: డైలాగ్స్ కాదు.. హీరోయిన్‌దే అసలైన మ్యాజిక్ – నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!

Funky: డైలాగ్స్ కాదు.. హీరోయిన్‌దే అసలైన మ్యాజిక్ – నాగవంశీ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Funky: సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్న ఈయన.. ఈ మధ్యకాలంలో అటు సోషల్ మీడియా వేదికగా, ఇటు ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ తమ సినిమాలను ఏ విధంగా ప్రమోషన్ చేసుకుంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని ప్రధాన అంశాలను ఆయన హైలెట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా యువతను టార్గెట్గా చేస్తూ ఆయన కోసం కాదు ఆ అమ్మాయి కోసమే థియేటర్ కి వస్తారు అంటూ నాగవంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఫంకీ పై పెరుగుతున్న అంచనాలు..

అసలు విషయంలోకి వెళ్తే.. జాతిరత్నాలు సినిమాతో తనకంటూ కామెడీ మార్క్ సృష్టించుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వంలో.. మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా డ్రాగన్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఖయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఫంకీ. తెలుగు కామెడీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనుదీప్ పంచ్.. కయాదు అందం..

Advertisement

ఫిబ్రవరి 13 2026న వాలెంటైన్స్ డే కి ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించగా.. అందులో నాగవంశీ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ప్రెస్ మీట్ లో భాగంగా అనుదీప్ పంచ్ ల కోసం కాదు అమ్మాయి కోసమే మీరు థియేటర్ కి వస్తారు.. రేపు పొద్దున సక్సెస్ మీట్ లో కూడా మీరు నన్ను ఇదే అడగండి అంటూ నాగ వంశీ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

also read:Film industry: మూగబోయిన గొంతు.. ప్రముఖ యాంకర్ కన్నుమూత!

హైప్ పెంచిన నాగ వంశీ..

Advertisement

కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమెను ఉద్దేశించి ముఖ్యంగా ఆమెను హైలైట్ చేస్తూ ఆమె స్క్రీన్ ప్రజెంట్ కి ఫిదా అవుతారు అంటూ నాగవంశీ తెలిపారు. ఇక థియేటర్లలో అనుదీప్ పంచులు ఏ విధంగా అయితే పేలుతాయో ఆమె అందం కూడా అదే విధంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటూ యువతను టార్గెట్గా చేసుకొని నాగవంశీ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం నాగ వంశీ ఇలాంటి మాస్టర్ ప్లాన్స్ బాగానే వేస్తారు.. ఆయన సినిమాకు కావలసినంత ప్రమోషన్ ఇచ్చుకుంటారు అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

మరొకవైపు ఎప్పుడూ మాస్ యాక్షన్ తో అందరినీ ఆకట్టుకునే విశ్వక్సేన్ ఈ సినిమాతో తన కామెడీ మార్కు చూపించబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫంకీ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×