E-Paper
Advertisement

Mrunal Thakur: సిగ్గు లేకుండా అవకాశాలు అడిగాను.. కెరీర్ కష్టాలను బయట పెట్టిన మృణాల్!

Mrunal Thakur: సిగ్గు లేకుండా అవకాశాలు అడిగాను.. కెరీర్ కష్టాలను బయట పెట్టిన మృణాల్!
Advertisement

Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోను అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా మృణాళ్ ఠాకూర్ తన కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను అంటూ తన ఇబ్బందుల గురించి తెలియజేశారు. మృణాళ్ ఠాకూర్ కెరీర్ లో టీవీ సీరియల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇలా మరాఠీ సీరియల్స్ లో నటించిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకున్నారు.

అవకాశాలను మనమే సృష్టించుకోవాలి..

సినిమాలపై ఆసక్తితో తాను అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపారు. నాకు సినిమా అవకాశాలు కల్పించమని నేను మొదటిసారి కలిసిన దర్శకుడు ఆదిత్యధర్. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు నాకు చాలా తేలికగా రాలేదు అవకాశాలను మనమే సృష్టించుకోవాలని మృణాళ్ ఠాకూర్ తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో నాకు అవకాశాలు రావాలి అంటే డైరెక్టర్లు నా ఫేస్ చూసేలా చేసుకోవాలి.

సినిమాలపై ఆసక్తితో అడిగేదాన్ని..

Advertisement

ఇలా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకోవడం కోసం ఇలాంటి పనులను చేయటానికి నేను ఏ మాత్రం సిగ్గుపడనని తెలిపారు. నటనపై నాకున్న ఆసక్తితో సిగ్గు లేకుండా అందరిని అవకాశాలు అడిగేదాన్ని అంటూ మృణాళ్ ఠాకూర్ ఈ సందర్భంగా కెరియర్ మొదట్లో అవకాశాల కోసం ఎంతోమంది డైరెక్టర్ల వద్దకు వెళ్లి తానే స్వయంగా అవకాశాలు ఇవ్వాలి అంటూ అడిగానని, ఇలా కష్టాలను అధిగమిస్తూ సినిమా అవకాశాలను అందుకొని తనని తాను నిరూపించుకున్నానని తెలిపారు. ఇలా బాలీవుడ్ సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు..

విడుదలకు సిద్ధమైన డెకాయిట్..

Advertisement

ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ పలు బాలీవుడ్, టాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుని వరుస షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఈమె త్వరలోనే అడవి శేష్ హీరోగా నటించిన డెకాయిట్ (Decoit)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నిజానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఇక మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు కానీ అదే రోజు పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో మరోసారి వాయిదా పడుతూ ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పాటలు మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: Teja Sajja: పెళ్లి పై బిగ్ అప్డేట్ ఇచ్చిన తేజ సజ్జ… త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారా?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×