E-Paper
Advertisement

Mrunal Thakur: ఆయనే లేకుంటే ఈరోజు నీడ లేదు -మృణాల్

Mrunal Thakur: ఆయనే లేకుంటే ఈరోజు నీడ లేదు -మృణాల్
Advertisement

Mrunal Thakur:మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. పదహారణాల తెలుగందం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. బాలీవుడ్ లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టినా .. తెలుగులో మాత్రం ప్రముఖ సినీ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నేరుగా చేసిన తొలి తెలుగు చిత్రం సీతారామం ద్వారా ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా యాక్షన్ ఫిలిం గా వచ్చిన ఈ సినిమాలో సీత పాత్రతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది.

ఆయనే నా లక్కీ చార్మ్!

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత నాని తో ‘హాయ్ నాన్న’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందించలేదు. ఇక ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న మృణాల్ ఠాకూర్..తాను ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడడానికి కారణం ఆయనేనని, ఆయన లేకపోతే తనకు నీడ కూడా లేదు అనే రేంజ్ లో కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

ఆయన వల్లే ఇండస్ట్రీలో ఉన్నాను – మృణాల్ ఠాకూర్

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.. పైగా ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరి ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడం పట్ల తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ విధంగా స్పందించింది మృణాల్ ఠాకూర్. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ రణవీర్ సింగ్ తో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని పంచుకుంది. ” రణవీర్ సింగ్ నా లక్కీ చార్మ్.. ఇండస్ట్రీలో నేను ఉన్నానంటే దానికి కారణం ఆయనే. నా కెరియర్ మొదట్లో రణవీర్ తో కలిసి నేను ఒక హెయిర్ బ్రాండ్ కమర్షియల్ యాడ్లో నటించాను. ఆ ఆడ్ టీవీలలో వచ్చిన తర్వాతే నిర్మాతలు నన్ను నోటీస్ చేయడం మొదలుపెట్టారు. అలా నాకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. నాకు ఈ సినిమా ఆఫర్లు రావడానికి కారణమైన రణవీర్ అంటే నాకు చాలా గౌరవం. ఆయన ఎంతో పాజిటివ్ పర్సన్. ఈ సక్సెస్ ను అనుభవించడానికి ఆయన పూర్తి అర్హుడు” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తనకు ఇండస్ట్రీలో ఉండడానికి అవకాశం కల్పించి , తనను ఈ స్థాయికి తీసుకురావడంలో మొదటి కీలకపాత్ర పోషించింది రణవీర్ సింగ్ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకుంది మృణాల్.

Advertisement

ALSO READ; Dhurandhar 2: దీపికపై ట్రోల్స్.. ఎవరు ఎవర్ని విమర్శించాలంటూ కౌంటర్?

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×