E-Paper
Advertisement

Mrunal Thakur: ధనుష్ తో పెళ్లి.. సడన్ ట్విస్ట్ ఇచ్చిన మృణాల్!

Mrunal Thakur: ధనుష్ తో పెళ్లి.. సడన్ ట్విస్ట్ ఇచ్చిన మృణాల్!
Advertisement

Mrunal Thakur:మృణాల్ ఠాకూర్.. ఒకప్పుడు హిందీలో పలు సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. తొలిసారి దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసుకుంది. ఈ ఒక్క సినిమా ఆమెకు ఊహించని విజయాన్ని అందించింది. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ అందుకుంది.. అలాంటి మృణాల్ ఠాకూర్ మళ్ళీ ‘హాయ్ నాన్న’ సినిమా చేసి మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అడవి శేషు హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది..

రూమర్స్ వేళ షాక్ ఇచ్చిన మృణాల్..

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా మృణాల్ వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమలో పడిందని, వీరిద్దరూ ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై మృణాల్ టీమ్ స్పందిస్తూ.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే. ఆమె పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది అంటూ ఖండించింది. అటు ధనుష్ కూడా ఈ వార్తలపై ఖండించి రూమర్లకి చెక్ పెట్టారు. ఇకపోతే ఎంత క్లారిటీ ఇచ్చినా రూమర్లు మాత్రం ఆగకపోవడంతో మరోసారి సడన్ ట్విస్ట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

also read:Nidhhi agerwal: నాపై కుట్ర జరుగుతోంది.. సంచలన విషయాలు బయటపెట్టిన నిధి..

అతడితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు పంచుకున్న మృణాల్..

తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ప్రముఖ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను పంచుకుంది . ఈ ఫోటోలు చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం బాలీవుడ్ లో ‘ దో దివానే సెహెర్ మే’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్న చిత్ర బృందం ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి ఎంతో ప్రయత్నం చేస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న పుకార్లకు ఒకరకంగా చెక్ పెట్టడానికి మృణాల్ ఈ సినిమా నుండి ఈ పోస్టర్లు పంచుకుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సంజయ్ లీలా భన్సాలీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. 1977 నాటి క్లాసిక్ సాంగ్ ‘ దో దివానే సెహెర్ మే’ రీమేక్ వెర్షన్ గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. ఇందులో ఆయేషా రజా, విరాజ్ గెహ్లాణీ, అరుణ్ జాయ్ సేన్ గుప్తా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×