E-Paper
Advertisement

Diabetes: వందేళ్ల క్రితం భయంకరమైన వ్యాధి డయాబెటిస్, కానీ ఈ ఔషధంతో అంతా మారిపోయింది

Diabetes: వందేళ్ల క్రితం భయంకరమైన వ్యాధి డయాబెటిస్, కానీ ఈ ఔషధంతో అంతా మారిపోయింది
Advertisement

డయాబెటిస్ వ్యాధి ఇప్పుడంటే సాధారణంగా మారిపోయింది. కానీ వందేళ్ళ క్రితం మాత్రం అది భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా గుర్తించేవారు. టైప్ 1 డయాబెటిస్ తో బాధపడే పిల్లలు, యువకులు ఎక్కువ కాలం బతికేవారు కాదు. డయాబెటిస్ బారిన పెద్దలు కూడా ఆ వ్యాధి వస్తే మరణం తప్పదని ముందే నిర్ణయించుకునేవారు. ఎందుకంటే అప్పట్లో రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రించే ఔషధం ఏదీ లేదు. తీవ్రమైన బలహీనతకు గురై మరణించేవారు. కానీ వైద్య ప్రపంచం దీనికి చక్కటి పరిష్కారాన్ని కనుగొంది. ఇన్సులిన్ అనే అద్భుతమైన హార్మోన్ ను కనుగొనడం వల్ల డయాబెటిస్ వ్యాధికి చెక్ పెట్టారు. ఈ ఏడాది నుంచి లెక్కపెట్టుకుంటే సరిగ్గా 104 ఏళ్ల క్రితం ఈ ఇన్సులిన్ ను కనిపెట్టారు. ఇది కోట్లాదిమంది ప్రాణాలను కాపాడింది.

ఇన్సులిన్ కనిపెట్టి
1921 సంవత్సరంలో కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలో ఈ ఇన్సులిన్ ఆవిష్కరణ జరిగింది. డాక్టర్ ఫెడరిక్ బాంటింగ్, అతని అసిస్టెంట్ కలిసి దీనిపై పరిశోధనలు ప్రారంభించారు. మన శరీరంలో పాంక్రియాస్ అనే గ్రంధి చక్కెరను నియంత్రించే ఒక ముఖ్యమైన పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని వారు కనిపెట్టారు. అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఆ పదార్థాన్ని వేరు చేసి శుద్ధి చేశారు. ఆ పదార్థమే ఇన్సులిన్.

Advertisement

Also read: BabyCorn Manchurian: బేబీ కార్న్ మంచూరియన్ .. ఇంట్లో సులువుగా రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదిగో

పిల్లాడిపై ప్రయోగం
ఇన్సులిన్ ను తొలిసారి 1922 పై లో ఒక మనిషి పై ప్రయోగించారు. దాన్ని ఇంజెక్షన్ రూపంలో ఒక బాలుడికి అందించారు. అతని వయసు కేవలం 14 ఏళ్ళు మాత్రమే. తీవ్రమైన టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతూ మరణానికి చేరువలో ఉన్నాడు. ఇన్సులిన్ ఇంజెక్షన్ అందుకున్న తర్వాత అతని రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా తగ్గాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. దీంతో వైద్యుల సైతం ఆశ్చర్యపోయారు. అప్పటివరకు మరణమే లేదనుకున్న వ్యాధికి ఇన్సులిన్ ఒక కొత్త ఔషధంగా మారింది. దీని తర్వాత ఇన్సులిన్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున డయాబెటిస్ రోగులకు అందించడం ప్రారంభించారు.

Advertisement

1923లో ఇన్సులిన్ కనిపెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ బాంటింగ్ కు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఇప్పటివరకు ఇన్సులిన్ చికిత్సలలో ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. మొదట జంతువుల ప్యాంక్రియాస్ నుంచే తీసిన ఇన్సులిన్ ను వాడేవారు. ఇప్పుడు ఆధునిక సైన్సులో సురక్షితమైన ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. 14 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఆవిష్కరణను కోట్లాదిమంది డయాబెటిస్ రోగులకు జీవించే అవకాశాన్ని అందిస్తుంది. అందుకే ఇన్సులిన్ నిజంగా వైద్య ప్రపంచానికి ఒక వరమనే చెప్పుకోవాలి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×