Jr. NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ బయటకు రాకుండా డైరెక్టర్ కూడా జాగ్రత్త పడుతున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్(NTR) కి సంబంధించిన ఒక స్టైలిష్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ ఫోటోని షేర్ చేశారు.
ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా , పొడువాటి జుట్టు, గడ్డంతో, నోట్లో టూత్ పిక్ పెట్టుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు మాత్రం తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ ను ఇలాంటి మేకోవర్ లో చూసి చాలా కాలం అవుతుంది. అయితే ఎన్టీఆర్ ఈ లుక్ ఏ సినిమా కోసం అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో ఈ మేకోవర్ లో కనిపించబోతున్నారా? లేదంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించబోయే గాడ్ ఆఫ్ వార్ సినిమా లుక్ నా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోయే సినిమా కోసం రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ లుక్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించింది కాదని స్పష్టం అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోయే సినిమా కోసం తమన్ సంగీత దర్శకుడిగా పని చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈయన ఎన్టీఆర్ ఫోటోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేయడంతో కచ్చితంగా గాడ్ ఆఫ్ వార్ సినిమాకి సంబంధించిన లుక్ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ ఈ లుక్ ఏ సినిమా కోసం అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ బర్త్ డే గ్లింప్స్ విడుదల..
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027 జూన్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి ఒక గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ఈ వీడియో పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ సినిమా నుంచి కూడా అనౌన్స్మెంట్ వీడియో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.
Also Read: గవర్నర్ విజయ్ కు అవకాశం ఇవ్వకపోవడానికి అదే కారణమా..కస్తూరి శంకర్ కామెంట్స్ వైరల్!